ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శభాష్‌ హిమేష్‌!

ABN, First Publish Date - 2021-01-28T08:06:13+05:30

అల్జీమర్స్‌తో బాధపడే వాళ్ల సమస్యలు వర్ణనాతీతం. వాళ్ల బాధలు చూసి కుటుంబసభ్యులు తట్టుకోలేరు. 14 ఏళ్ల హిమేష్‌ చదలవాడ కూడా తన గ్రాండ్‌మదర్‌ అల్జీమర్స్‌తో బాధపడటాన్ని చూసి ఏదైనా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్జీమర్స్‌తో బాధపడే వాళ్ల సమస్యలు వర్ణనాతీతం. వాళ్ల బాధలు చూసి కుటుంబసభ్యులు తట్టుకోలేరు. 14 ఏళ్ల హిమేష్‌ చదలవాడ కూడా తన గ్రాండ్‌మదర్‌ అల్జీమర్స్‌తో బాధపడటాన్ని చూసి ఏదైనా చేయాలనుకున్నాడు. అల్జీమర్స్‌ పేషెంట్ల కోసం ఒక రిస్ట్‌బ్యాండ్‌ను తయారుచేశాడు. దాంతో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కారానికి ఎంపికయ్యాడు.


హైదరాబాద్‌కు చెందిన హిమేష్‌ 9వ తరగతి చదువుతున్నాడు. ఏడాది కాలంగా ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నాడు.  ‘‘చిన్నప్పటి నుంచి అల్జీమర్‌తో గ్రాండ్‌మదర్‌ పడుతున్న కష్టాలు చూస్తూ పెరిగాను. తను ఉన్నట్టుండి ఇంట్లో నుంచి కనిపించకుండా పోయేది. ఆమె కోసం వీధులన్నీ గాలించే వాళ్లం. అప్పుడే అల్జీమర్స్‌తో బాధపడే వారి కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నా’’ అని అంటాడు హిమేష్‌.

 హిమేష్‌ తయారుచేసిన ఈ డివైజ్‌ పేషెంట్‌ పల్స్‌, బి.పిని మానిటర్‌ చేస్తూ, ఏదైనా అబ్‌నార్మాలిటీ ఉంటే ఆటోమెటిక్‌గా అలర్ట్‌లను పంపుతూ ఉంటుంది. ఈ డివైజ్‌లో ఉన్న జిపిఎస్‌ సహాయంతో వాళ్లు ఎక్కడున్నదీ తెలుసుకోవచ్చు.

పదేళ్ల వయసులోనే హిమేష్‌ ఎలకా్ట్రనిక్స్‌పై ఇష్టం పెంచుకున్నాడు. కొత్త కొత్త పరికరాలు తయారు చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ కొత్త డివైజ్‌లు తయారుచేస్తూ శభాష్‌ అనిపించుకుంటున్నాడు.

Updated Date - 2021-01-28T08:06:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising