ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడేళ్ల బుడతడు కిలిమంజారో ఎక్కేశాడు

ABN, First Publish Date - 2021-03-18T05:30:00+05:30

స్ఫూర్తిని రగిలించే కథలు ఆ చిన్నారిని ఒక రికార్డు నెలకొల్పే వైపు అడుగులు వేసేలా చేశాయి. హైదరాబాద్‌కు చెందిన ఏడేళ్ల విరాట్‌ చంద్ర ఆఫ్రికాలో ఎత్తైన పర్వతం కిలిమంజారోను అధిరోహించి, ఆ ఫీట్‌ను సాధించిన పిన్న వయస్కుల్లో ఒకడిగా నిలిచాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్ఫూర్తిని రగిలించే కథలు ఆ చిన్నారిని ఒక రికార్డు నెలకొల్పే వైపు అడుగులు వేసేలా చేశాయి. హైదరాబాద్‌కు చెందిన ఏడేళ్ల విరాట్‌ చంద్ర ఆఫ్రికాలో ఎత్తైన పర్వతం కిలిమంజారోను అధిరోహించి, ఆ ఫీట్‌ను సాధించిన పిన్న వయస్కుల్లో ఒకడిగా నిలిచాడు.

  • కిలిమంజారో ఎక్కడం అంత సులువుకాదు. అక్కడి వాతావరణం పర్వతారోహకులకే సవాలు విసురుతుంది. అలాంటి క్లిష్టమైన పరిస్థితులను దాటుకుని అక్కడి చేరుకోవడం వెనక విరాట్‌ కృషి, పట్టుదల ఉన్నాయి. 
  • పర్వతం అధిరోహించే సమయంలో కాస్త భయపడ్డా, చివరకు లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఈ సమయంలో కోచ్‌ భరత్‌ వెన్నంటే ఉండి గమ్యాన్ని చేరుకునేలా ప్రోత్సహించాడు.
  • ‘‘మా కజిన్స్‌ చెప్పే స్టోరీలు వింటున్నప్పుడు నాకు క్లైంబింగ్‌ చేయాలని అనిపించేది. ఒకరకంగా వాళ్లు చెప్పిన కథలే నాకు స్ఫూర్తి. వాళ్లు పర్వతారోహణ చేసినప్పుడు వాళ్ల అనుభవాలను అడిగి తెలుసుకునే వాణ్ణి. నా ఆసక్తిని పేరెంట్స్‌కు చెబితే వాళ్లు ఓకే అన్నారు. భరత్‌ సార్‌ శిక్షణ ఇచ్చారు’’ అని చెప్పుకొచ్చారు విరాట్‌.
  • ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తొమ్మిదేళ్ల రిత్విక ఇటీవలే కిలిమంజారో అధిరోహించారు. ఇక 2018లో కిలిమంజారో అధిరోహించిన న్యూమెక్సికోలోని అల్బుకెర్కికి చెందిన ఆరేళ్ల కాల్టన్‌ టానర్‌ పేరిట అతి పిన్న వయస్కుడిగా రికార్డు నమోదయి ఉంది. 

Updated Date - 2021-03-18T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising