ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృక్షో రక్షతి రక్షితః

ABN, First Publish Date - 2021-02-08T05:30:00+05:30

ఓ రహదారి పక్కన పెద్ద వృక్షం చాలా కాలంగా ఉంది. బాగా విస్తరించిన ఆ వృక్షం బాటసారులకు నీడనిచ్చేది. అక్కడ సేద తీరేవారు ఆ వృక్షం గురించి గొప్పగా చెప్పేవారు. ఆ పొగడ్తలతో ఆ చెట్టు తనను తాను గొప్పగా ఊహించుకునేది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓ రహదారి పక్కన పెద్ద వృక్షం చాలా కాలంగా ఉంది. బాగా విస్తరించిన ఆ వృక్షం బాటసారులకు నీడనిచ్చేది. అక్కడ సేద తీరేవారు ఆ వృక్షం గురించి గొప్పగా చెప్పేవారు. ఆ పొగడ్తలతో ఆ చెట్టు తనను తాను గొప్పగా ఊహించుకునేది. ఆ చెట్టు సమీపంలో చిన్న చిన్న మొక్కలు ఉండేవి. అవి పెరిగితే తనను ఎవరు పట్టించుకోరు అన్న భయంతో ఆ చిన్న మొక్కలకు నీరందకుండా చేసేది. దాంతో ఆ చిన్న మొక్కలు ఎదుగూబొదుగూ లేకుండా నీటి కోసం అల్లాడిపోయేవి. మొక్కలన్నీ ఏకమై మాక్కూడా నీరు పీల్చుకునే అవకాశం కలిగించమని వేడుకున్నా ఆ వృక్షం కనికరించలేదు. ఒకరోజు ట్రాక్టర్‌లో కూలీలు చెట్టు కింద కూర్చుని ‘‘ఈరోజు ఎలాగైనా ఈ చెట్టును నరికి పట్టణంలో ఉన్న మిల్లులో అమ్మేయాలి’’ అని మాట్లాడుకోసాగారు. దాంతో ఆ చెట్టుకు ఏం చేయాలో పాలుపోయలేదు. కూలీలు రంపాలతో చెట్టును కోసేందుకు సిద్ధమవుతుండగా చిన్న మొక్కలన్నీ కలిసి ‘‘మిమ్మల్ని బతికించేందుకు, మంచి గాలి అందించేందుకు, వర్షాలు బాగా పడేందుకు ఈ చెట్టు ఎంతగానో సహాయపడుతోంది. ఈ చెట్టును నరికేస్తే మీ ఆరోగ్యం, మీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో తెలుసా? ‘వృక్షో రక్షతి రక్షితః’ అంటే అర్థం తెలుసా? వృక్షాలను రక్షిస్తే అవి మిమ్మల్ని రక్షిస్తాయి’’ అని అన్నాయి. దాంతో వాళ్లు చెట్టును నరకకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పుడు ఆ వృక్షం ‘‘నేనేమో మీకు నీళ్లు అందకుండా చేసి చంపాలనుకున్నాను. మీరేమో నన్ను కాపాడారు. నన్ను మన్నించండి. ఇక నుంచి అందరం కలిసి ఉందాం. మీరూ ఎదిగి అందరికి నీడను పంచాలి’’ అని అంది. 

పంపినవారు

టి. వెంకటసాయి సుచిత్ర, 9వ తరగతి, 

శ్రీ వివేకానంద విద్యానికేతన్‌, ఖమ్మం

Updated Date - 2021-02-08T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising