ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోతి-కొబ్బరిచిప్ప

ABN, First Publish Date - 2021-01-23T05:30:00+05:30

ఒక చిట్టడవిలో ఒక కోతుల గుంపు నివసించేది. ఒకరోజు అమ్ము అనే కోతికి ఒక కొబ్బరిచిప్ప దొరికింది. దానికి అదేంటో అర్థం కాలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక చిట్టడవిలో ఒక కోతుల గుంపు నివసించేది. ఒకరోజు అమ్ము అనే  కోతికి ఒక కొబ్బరిచిప్ప దొరికింది. దానికి అదేంటో అర్థం కాలేదు. పైన గరుకుగా, లోపల మెత్తగా ఉండటంతో కొరికి చూసింది. రుచిగా ఉండటంతో కొబ్బరిని కొరికి తినే సింది. ఖాళీ కొబ్బరి చిప్పను పడేయడానికి దానికి మనసొప్పలేదు. చెట్టుపైన ఒక చోట దాచుకుంది. రోజూ ఆ కొబ్బరిచిప్పను జాగ్రత్తగా కాపాడుకునేది. దాని వింత చేష్టలు చూసి మిగతా కోతులు నవ్వుకునేవి. ఒకరోజు జోరున వర్షం కురిసింది. కోతులన్నీ తడిసి ముద్దయ్యాయి. అమ్ము మాత్రం కొబ్బరిచిప్పను తలపై గొడుగులా పెట్టుకుని తడవకుండా ఉంది. కొబ్బరిచిప్ప గొడుగులా ఉపయోగపడటంతో దాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మిగతా కోతులకేసి చూస్తూ వేళాకోళమాడింది. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలోనూ కొబ్బరిచిప్పను తలపై పెట్టుకుని తిరిగేది. కొబ్బరి చిప్ప దొరకడం అదృష్టంగా భావించేది. మిగతా కోతులకు కూడా కొబ్బరిచిప్ప దొరకడం గురించి గొప్పగా చెప్పేది. అమ్ము బడాయి మాటలు విని మిగతా కోతులు నవ్వుకునేవి. ఒకరోజు సాయంత్రం కోతులన్నీ చెట్టు కింద చేరి ఆడుకుంటున్నాయి. అదే సమయంలో ఈదురుగాలులు మొదలయ్యాయి.


చెట్ల కొమ్మలు ఊగుతుండటం, ఆకాశంలో మబ్బులు కమ్ముతుండటంతో కోతులన్నీ భయంతో ఓ మూలన చేరాయి. అమ్ము మాత్రం కొబ్బరి చిప్ప ఉందన్న దైర్యంతో ‘నాకు వానపడినా భయం లేదు. నా దగ్గర కొబ్బరి చిప్ప ఉందిగా’ అంటూ గెంతులేయసాగింది. అదే సమయంలో గాలికి చెట్టుపై దాచి పెట్టిన కొబ్బరిచిప్ప అమ్ము నెత్తిపై పడింది. అంతే.. అమ్ము తల బొప్పి కట్టింది. కొబ్బరిచిప్ప ముక్కలైంది. మిగతా కోతులన్నీ పాపం అంటూ... అమ్ముకు సపర్యలు చేశాయి. అమ్ము సిగ్గుపడుతూ మిగతా కోతులపట్ల కృతజ్ఞతగా చూసింది. అప్పటి నుంచి గొప్పలకు పోకుండా మిగతా కోతులతో స్నేహంగా ఉంది.


పంపినవారు: టి. వెంకటసాయి సుచిత్ర

9వతరగతి, శ్రీవివేకానంద విద్యానికేతన్‌, ఖమ్మం

Updated Date - 2021-01-23T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising