ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోమరిపోతు గాడిద!

ABN, First Publish Date - 2021-04-18T05:30:00+05:30

ఒక ఊరిలో ఓ వ్యాపారి ఉండేవాడు. అతడి దగ్గర ఒక సోమరిపోతు గాడిద ఉండేది. అది పనికి చాలా బద్దకించేది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక ఊరిలో ఓ వ్యాపారి ఉండేవాడు. అతడి దగ్గర ఒక సోమరిపోతు గాడిద ఉండేది. అది పనికి చాలా బద్దకించేది. ఒకరోజు ఆ వ్యాపారి పట్టణానికి వెళ్లి ఉప్పు అమ్ముకుని రావడానికి బయలుదేరాడు. రెండు ఉప్పు సంచులు గాడిద వీపుపై పెట్టి ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ పట్టణం చేరుకోవాలంటే మధ్యలో చిన్న నది దాటాల్సి ఉంటుంది. ఆ నదిపై వంతెన లేదు. గాడిద ఆ నదిని దాటే  క్రమంలో జారి నీళ్లలో పడిపోయింది. వెంటనే వ్యాపారి ఉప్పు సంచులను అందుకున్నాడు అప్పటికే ఉప్పు సంచులు నీళ్లలో పడి ఉప్పు కొద్దిగా కరిగిపోయింది.


ఆ వ్యాపారి బాధపడుతూనే మిగిలిన ఉప్పు సంచిని గాడిద వీపుపై పెట్టి తిరిగి ప్రయాణం మొదలుపెట్టాడు. సంచులో నీళ్లలో పడి ఉప్పు కరిగిపోవడంతో బరువు తేలికయిందని గాడిద గ్రహించింది. పట్టణానికి చేరుకున్న వ్యాపారి ఉప్పును అమ్మేసి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. మరుసటి రోజు మళ్లీ రెండు ఉప్పు సంచులను గాడిద వీపుపై పెట్టి పట్టణానికి బయలుదేరాడు. పనికి బద్దకించే గాడిద బరువును తగ్గించుకోవడం కోసం నది దాటే సమయంలో కావాలని పడిపోయింది. ఆ విషయాన్ని వ్యాపారి గ్రహించాడు.


మరుసటిరోజు ఉప్పు సంచులు కాకుండా పత్తి సంచులను గాడిద వీపుపై పెట్టాడు. వీపుపై ఉన్నవి పత్తి సంచులు అని తెలియని గాడిద బరువును తగ్గించుకోవడం కోసం కాలుజారినట్టుగా నదిలో పడిపోయింది. పత్తి సంచులు తడవడంతో బరువు రెట్టింపయింది. గాడిద ఆ బరువును మోసుకుంటూ వెళ్లకతప్పలేదు. సోమరిపోతు గాడిదకు తగిన శాస్తి జరిగిందని మనసులో అనుకున్నాడు వ్యాపారి.


Updated Date - 2021-04-18T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising