ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజు గారి ఆజ్ఞ!

ABN, First Publish Date - 2021-10-31T05:30:00+05:30

తెనాలి రామకృష్ణ అంటే శ్రీకృష్ణదేవరాయలకు అభిమానం, ఈఈఅఅలాలలమంచి అభిప్రాయం ఉండేది. ఎలాగైనా అది దూరం.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెనాలి రామకృష్ణ అంటే శ్రీకృష్ణదేవరాయలకు అభిమానం, ఈఈఅఅలాలలమంచి అభిప్రాయం ఉండేది. ఎలాగైనా అది దూరం చేయాలని ప్రధాన పూజారి, ఆయన ఆనుచరులు రాజుగారి దగ్గర తెనాలి రామకృష్ణ గురించి తప్పుడు మాటలు చెప్పారు. ఆ మాటలు విన్న రాజు వెంటనే తెనాలి రామకృష్ణను సభకు తీసుకురమ్మని ఆదేశించాడు. సభలో అడుగుపెట్టిన రామకృష్ణ, రాజుగారికి ఏదో చెప్పబోతుండగానే ‘‘నీ ముఖం నాకు మళ్లీ చూపించకు’’ అని కోపంగా అన్నాడు రాజు. ‘‘కానీ... మహారాజా.. నేనే ఏం చేశానని..’’ అంటుండగానే ‘‘చాలు.. నువ్వు చెప్పేది ఏదీ నేను వినదలుచుకోలేదు.


నా ఆదేశాలు నువ్వు పాటించాల్సిందే’’ అంటూ ఆజ్ఞాపించాడు రాజు. మహారాజు వినే స్థితిలో లేరని అర్థమైన తెనాలి రామకృష్ణ విచార వదనంతో వెళ్లిపోయాడు. కొన్నిరోజుల తరువాత గూఢచారుల ద్వారా తెనాలి రామకృష్ణ అమాయకుడు అని రాజుకి తెలిసింది. రామకృష్ణ ఎక్కడున్నా వెతికి పట్టుకురమ్మని భటులను ఆజ్ఞాపించాడు. భటులు రామకృష్ణను సభకు తీసుకుని వచ్చారు. తలపై ఒక కుండను బోర్లించుకుని సభలో అడుగుపెట్టాడు రామకృష్ణ. అది చూసిన మహారాజు ‘‘ఎందుకలా ముఖం దాచుకుంటున్నావు రామకృష్ణా?’’ అని అడిగాడు. అప్పుడు రామకృష్ణ ‘‘మహారాజా, విజయనగర పౌరుడిగా రాజు గారి ఆదేశాలను పాటించడం నా బాధ్యత. అందుకే ముఖం కనిపించకుండా ఇలా వచ్చాను’’ అని అన్నాడు. ఆ మాటలు విన్న మహారాజు బిగ్గరగా నవ్వి ‘‘ముందు ఆ కుండను తొలగించు. నువ్వు చెప్పేది వినకుండా నిర్ణయం తీసుకున్నందుకు క్షమించు’’ అన్నాడు. 

Updated Date - 2021-10-31T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising