ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జన్నత్‌ పేరు పాఠ్యాంశాల్లో..!

ABN, First Publish Date - 2021-02-07T05:48:35+05:30

కళ్ల ముందు చెత్త కనిపించినా మనకెందుకులే అని చూసీ చూడనట్టుగా పోతుంటారు చాలా మంది. కానీ కశ్మీర్‌కు చెందిన ఏడేళ్ల జన్నత్‌ మాత్రం అలా ‘నాకెందుకు?’ అని వదిలేయలేదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కళ్ల ముందు చెత్త కనిపించినా మనకెందుకులే అని చూసీ చూడనట్టుగా పోతుంటారు చాలా మంది. కానీ కశ్మీర్‌కు చెందిన ఏడేళ్ల జన్నత్‌ మాత్రం అలా ‘నాకెందుకు?’ అని వదిలేయలేదు. దాల్‌ సరస్సులో పేరుకుపోతున్న చెత్తను స్వయంగా తొలగించడం మొదలుపెట్టింది. 


  1. శ్రీనగర్‌లోని లింటన్‌ హాల్‌ పబ్లిక్‌స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్న జన్నత్‌ ఐదేళ్ల వయసులోనే దాల్‌ సరస్సును శుభ్రంగా ఉంచడాన్ని ఒక బాధ్యతగా తీసుకుంది. తండ్రి తారిక్‌ అహ్మద్‌తో కలిసి సరస్సును శుభ్రం చేయడం మొదలుపెట్టింది.
  2. జన్నత్‌ చేస్తున్న పనిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అందరూ జన్నత్‌లా ఉండేందుకు ప్రయత్నించాలని కోరారు. ట్విట్టర్‌లోనూ జన్నత్‌ను అభినందించారు.
  3. హైదరాబాద్‌లోని ఒక స్కూల్‌ పాఠ్యాంశాల్లో జన్నత్‌ స్టోరీని చేర్చారు. ‘‘ఒకరోజు హైదరాబాద్‌లో ఉండే మా స్నేహితుడు ఫోన్‌ చేసి, స్థానిక స్కూల్‌ టెక్ట్స్‌బుక్‌లో జన్నత్‌ పేరు ఉన్నట్టు చెప్పారు. ఆ సమయంలో నాకెంతో గర్వంగా అనిపించింది’’ అని జన్నత్‌ తండ్రి తారిక్‌ అహ్మద్‌ అంటారు.
  4. ‘‘మా నాన్నను చూసే నేను స్ఫూర్తి పొందాను. ఇద్దరం కలిసి దాల్‌ సరస్సును కొద్దిగా శుభ్రం చేశాం. కానీ అది సరిపోదు. చాలా చెత్త పేరుకుపోయు ఉంది. అందరం కలిసి దాల్‌ సరస్సు అందాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది’’ అని అంటారు జన్నత్‌.

Updated Date - 2021-02-07T05:48:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising