ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది మానవ నిర్మితం!

ABN, First Publish Date - 2021-07-10T07:42:08+05:30

ఈ చిత్రం చూడండి. ఒక స్త్రీ ఆకారం కనిపిస్తోంది కదూ! ఆ ఆకారం రూపుదిద్దుకుంది ఎలాగో తెలుసా? బొగ్గు గనులు తవ్వగా వెలువడిన వ్యర్థాలతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్రం చూడండి. ఒక స్త్రీ ఆకారం కనిపిస్తోంది కదూ! ఆ ఆకారం రూపుదిద్దుకుంది ఎలాగో తెలుసా? బొగ్గు గనులు తవ్వగా వెలువడిన వ్యర్థాలతో! ఇంతకీ ఆ ప్రదేశం ఎక్కడుందో తెలుసా!


బ్రిటన్‌లోని క్రామ్లింగ్టన్‌ పట్టణంలో బొగ్గు గనులు ఉన్నాయి. దానికి సమీపంలోనే నార్తంబర్‌లాండ్‌ పేరుతో పర్యాటక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశాన్ని పైనుంచి చూస్తే ఒక స్త్రీ ఆకారంలో కనిపిస్తుంది. 

అమెరికాకు చెందిన ల్యాండ్‌స్కేప్‌ అర్కిటెక్ట్‌ చార్లెస్‌ జెన్క్స్‌ దీని సృష్టికర్త. ప్రపంచంలోనే అతి పెద్ద మానవనిర్మిత శిల్పం ఇది. 

ఈ శిల్పాన్ని ఒపెన్‌కా్‌స్ట మైనింగ్‌ జరపడం వల్ల వచ్చిన వ్యర్థాలతో నిర్మించారు. బొగ్గు గనులు తవ్వే క్రమంలో వెలువడిన రాళ్లను, మట్టిని ఎక్కడ పోయాలో అర్థం కాలేదు. వాటిని పారబోయడం కన్నా తిరిగి వాటితో ఒక ఆకారాన్ని రూపొందించాలని ఉద్యోగులందరూ భావించారు. అలా వారి ఆలోచనలో నుంచి పుట్టిందే ఆ శిల్పం. 

గనుల్లో నుంచి తీసిన 1.5 మెట్రిక్‌ టన్నుల రాక్‌ను ఈ శిల్పం తయారీలో ఉపయోగించారు. కొన్ని చోట్ల కృత్రిమంగా హైలెట్‌ అయ్యేందుకు రాళ్లను ఉపయోగించారు. మొత్తంగా ఒక స్త్రీ ఆకారం వచ్చేలా చేశారు. ఇప్పుడు ఆ ప్రాంతం పర్యాటకులతో ఎప్పుడూ సందడిగా ఉంటుంది.

Updated Date - 2021-07-10T07:42:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising