ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మండు వేసవిలోనూ అక్కడ ఐస్‌ కరగదు!

ABN, First Publish Date - 2021-05-08T04:57:17+05:30

ఒక ఐస్‌ ముక్కను తీసి చేతిలో పట్టుకోండి. ఎండలు మండిపోతున్న ఈ సమయంలో కాసేపట్లోనే ఐస్‌ కరిగిపోతుంది. కానీ ఆ గుహలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక ఐస్‌ ముక్కను తీసి చేతిలో పట్టుకోండి. ఎండలు మండిపోతున్న ఈ సమయంలో కాసేపట్లోనే ఐస్‌ కరిగిపోతుంది. కానీ ఆ గుహలో ఉన్న ఐస్‌ మాత్రం కొంచెం కూడా కరగదు. ఇంకా చెప్పాలంటే ఏడాదంతా మంచుతోనే ఉంటుంది. ఆ విశేషాలు ఇవి...


చైనాలోని షాంక్సి ప్రాంతంలో ఒక మంచు గుహ ఉంది. ఆ గుహ మొత్తం మంచుతో నిండి ఉంటుంది. ఆ గుహను ‘నింగ్వు కేవ్‌’ అని అంటారు

బయట ఎంత వేడి ఉన్నా గుహలోపల మంచు మాత్రం కొంచెం కూడా కరగదు. వేసవికాలంలోనూ మంచు కరగకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 

ఇక్కడ మంచు కరగకపోవడానికి కారణం ఉంది. ఇలాంటి గుహలను ‘కోల్డ్‌ట్రాప్స్‌’ అని పిలుస్తారు. ఇవి సహజసిద్ధంగా ఏర్పడినవే అయినా వీటిలో ప్రత్యేకత ఉంటుంది. చలికాలంలో చల్లటిగాలి లోపలకి వచ్చేలా దారి ఉంటుంది. కానీ వేసవిలో వేడిగాలి లోపలకు రాదు.

చలికాలంలో గుహలోకి చేరిన చల్లటిగాలి గుహలోనే ఉండిపోతుంది. తేలికగా ఉన్న వేడిగాలి లోపలికి ప్రవేశించలేదు. ఫలితంగా గుహలో మంచు కరగకుండా అలాగే ఉంటుంది. అప్పటికే ఉన్న మంచు గుహలోపలికి కొద్దిగా వేడిగాలి ప్రవేశించినా వెంటనే చల్లబరుస్తుంది.

Updated Date - 2021-05-08T04:57:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising