ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జింక పిల్లతో స్నేహం!

ABN, First Publish Date - 2021-02-03T05:30:00+05:30

ఇంట్లో పిల్లలు పెంపుడు జంతువులతో ఆడుకోవడం చూస్తుంటాం. అలానే ఇంటికి స్నేహితులును తీసుకురావడం తెలిసిందే. కానీ ఈ నాలుగేళ్ల బాలుడు మాత్రం ఆరుబయట ఆడుకోవడానికి వెళ్లి, తిరిగి ఇంటికి జింక పిల్లను తీసుకొని వచ్చాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంట్లో పిల్లలు పెంపుడు జంతువులతో ఆడుకోవడం చూస్తుంటాం. అలానే ఇంటికి స్నేహితులును తీసుకురావడం తెలిసిందే. కానీ ఈ నాలుగేళ్ల బాలుడు మాత్రం ఆరుబయట ఆడుకోవడానికి వెళ్లి, తిరిగి ఇంటికి జింక పిల్లను తీసుకొని వచ్చాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే....


అమెరికాలోని వర్జీనియా రాష్టం మస్సానుట్టెన్‌ ప్రాంతానికి చెందిన డోమినిక్‌ అనే పిల్లాడు ఒకరోజు ఆడుకోవడానికి బయటకు వెళ్లాడు. కొద్దిసేపయ్యాక ఇంటికి వచ్చాడు. ఇంటి తలుపు తీసిన ఆ పిల్లాడి అమ్మ అతడి పక్కన జింక పిల్లను చూసి ఆశ్చర్యపోయింది. ‘‘మా అబ్బాయి డోమినిక్‌ రోజూలానే ఆడుకోవడానికి బయటకు వెళ్లాడు. ఇంటికి వచ్చేటప్పడు జింక పిల్లను వెంట తీసుకొచ్చాడు. తలుపు తీయగానే నా కొడుకుతో పాటు జింక పిల్లను చూసి నేను షాక్‌కు గురయ్యాను.


ఆ క్షణం నాకు ఏం చేయాలో పాలుపోలేదు. ఇద్దరినీ ఫొటో తీశాక, మావాడితో ‘కొద్దిసేపు ఇద్దరూ బయట ఆడుకోండి. ఆలోపు ఆ జింక పిల్ల తల్లి వచ్చేస్తుంది’ అని చెప్పాను’’ అని చెప్పుకొచ్చింది డోమినిక్‌ వాళ్ల అమ్మ. అతడు జింకతో ఉన్న ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ కూడా చేసింది. ఈ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో 23 వేల మందికి పైగా షేర్‌ చేయడం విశేషం. 

Updated Date - 2021-02-03T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising