ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాపం ఎలుగుబంటి!

ABN, First Publish Date - 2021-06-13T05:30:00+05:30

ఒక చిట్టడవిలో ఒక ఎలుగుబంటి నివసించేది. అనారోగ్యంగా ఉండటంతో చాలా రోజులుగా అది గుహ నుంచి బయటకు రాలేదు. ఒకరోజు బాగా ఆకలి వేయడంతో వేట కోసం బయటకు వచ్చింది. దగ్గరలో ఉన్న నది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక చిట్టడవిలో ఒక ఎలుగుబంటి నివసించేది. అనారోగ్యంగా ఉండటంతో చాలా రోజులుగా అది గుహ నుంచి బయటకు రాలేదు. ఒకరోజు బాగా ఆకలి వేయడంతో వేట కోసం బయటకు వచ్చింది. దగ్గరలో ఉన్న నది దగ్గరకు వెళ్లి చేపలు పట్టుకుని తినాలని అనుకుంది. నెమ్మదిగా వెళ్లి నది ఒడ్డున కూర్చుంది. కాసేపయ్యాక చేప కనిపించడంతో ఠక్కున పట్టేసింది. కానీ ‘‘ఈ చేప చాలా చిన్నగా ఉంది. ఈ చేపతో నా కడుపు నిండదు. పెద్ద చేపను పట్టుకుంటాను’’ అని మనసులో అనుకుని దొరికిన ఆ చిన్న చేపను వదిలేసింది.


కాసేపయ్యాక మరో చేప దొరికింది. కానీ అది కూడా చిన్నదే. సాయంత్రం కావస్తున్నా ఒక్క పెద్ద చేప దొరకలేదు. చాలా చేపలు దొరికినా అన్ని చిన్నవే కావడంతో తిరిగి నీటిలో వదిలేసింది. చివరకు సూర్యాస్తమయం అయింది. ఎలుగుబంటి ఖాళీ కడుపుతోనే ఉండిపోయింది. చిన్న చేపలన్నింటినీ తిన్నా కడుపు నిండేది అని మనసులో అనుకుంటూ గుహకు చేరుకుంది. వచ్చిన అవకాశాలను వదులుకోకూడదు అన్నది ఈ కథలో నీతి. 

Updated Date - 2021-06-13T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising