ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ చేప షార్ప్‌ షూటర్‌!

ABN, First Publish Date - 2021-02-01T05:36:26+05:30

తుపాకీతో గురి తప్పకుండా కాల్చే షార్ప్‌ షూటర్స్‌ గురించి వినే ఉంటా రు. ఇక్కడ ఈ చేప కూడా షార్ప్‌ షూటరే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుపాకీతో గురి తప్పకుండా కాల్చే షార్ప్‌ షూటర్స్‌ గురించి వినే ఉంటా రు. ఇక్కడ ఈ చేప కూడా షార్ప్‌ షూటరే. అయితే ఈ చేప నోట్లో నుంచి నీళ్లను బుల్లెట్‌లా గురి చూసి వదులుతుంది. ఆర్చర్‌ ఫిష్‌ అని పిలిచే ఈ చేప దక్షిణ, ఆగ్నేయాసియా ప్రాంతాల్లోని మడ అడవుల్లో కనిపిస్తుంది. 


చెట్లపై ఉన్న కీటకాలను వేటాడే సమయంలో నీటి అడుగు భాగాన ఓపికగా నిరీక్షిస్తుంది. కీటకం తన పరిధిలోకి వచ్చిందని భావిస్తే, నోట్లో నుంచి నీటిని జెట్‌ స్పీడ్‌తో వదిలి ఆ కీటకం పట్టుతప్పి నీళ్లలో పడేలా చేస్తుంది. నీళ్లను వదిలేముందు నోటిని గన్‌ బ్యారెల్‌లా చేస్తుంది. నాలుక సహాయంతో నీళ్లను వేగంగా వదులుతుంది.


నీళ్లను వదిలే ముందు టార్గెట్‌ ఎంత దూరంలో ఉంది? నీళ్ల వేగానికి పడిపోయే అవకాశాలు ఎంత మేర ఉన్నాయో సరిగ్గా అంచనా వేస్తుంది. ఈ చేప రెండు మీటర్ల దూరం వరకు నీళ్లను జెట్‌ వేగంతో పంపగలదు. ఈ చేప చిన్న చిన్న కీటకాలు, స్పైడర్లు, చిన్న చిన్న బల్లులను ఆహారంగా తీసుకుంటుంది.

Updated Date - 2021-02-01T05:36:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising