ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలా కాల్చడం ఆనవాయితీ!

ABN, First Publish Date - 2021-03-23T05:30:00+05:30

దీపావళి రోజున బాణసంచా కాల్చుతాం. కానీ గ్రీక్‌ ద్వీపమైన చియోస్‌లోని రోంటడాస్‌ నగరంలో మాత్రం ఒకరికిపైకి ఒకరు రాకెట్లు ఎక్కుపెట్టుకుంటారు. రాకెట్ల కాంతులతో అక్కడ యుద్ధవాతావరణం కనిపిస్తుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దీపావళి రోజున బాణసంచా కాల్చుతాం. కానీ గ్రీక్‌ ద్వీపమైన చియోస్‌లోని రోంటడాస్‌ నగరంలో మాత్రం ఒకరికిపైకి ఒకరు రాకెట్లు ఎక్కుపెట్టుకుంటారు. రాకెట్ల కాంతులతో అక్కడ యుద్ధవాతావరణం కనిపిస్తుంది.


  1. ఈస్టర్‌ పర్వదినాన బాణసంచా కాల్చడం ఆనవాయితీ. అయితే రోంటడాస్‌ నగరవాసులు మాత్రం బాణసంచాను భిన్నంగా కాలుస్తారు. 
  2. నగరంలో ఉన్న రెండు చిన్న కొండలపై చర్చిలు ఉన్నాయి. సుమారు అర కిలోమీటరు దూరంలో ఎదురెదురుగా ఉన్న ఈ చర్చిల్లో నుంచి ఒకరిపైకి మరొకరు రాకెట్లు కాలుస్తారు. ఇది కొన్ని దశాబ్దాల నుంచి ఈ సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది.
  3. దశాబ్దాల క్రితం ఆయుధాలతో కొట్టుకునే వారట. ప్రాణనష్టం జరుగుతుండటంతో వాటిపై నిషేధం విధించారు. ఇప్పుడు పొడవైన కర్రలను రాకెట్లుగా చేసి ఉపయోగిస్తున్నారు. 
  4. ఇక ఊళ్లో వాళ్లు రాకెట్ల మూలంగా ప్రమాదాలు జరగకుండా ఇళ్లకు జాలీలు ఏర్పాటు చేసుకుంటారు. యువకులు ఉత్సాహంగా జరుపుకొనే ఈ కార్యక్రమాన్ని చూడటానికి పర్యాటకులు తరలివస్తుంటారు.

Updated Date - 2021-03-23T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising