ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే నెలలో అలరించనున్న డోరెమాన్‌-2

ABN, First Publish Date - 2021-01-22T05:30:00+05:30

డోరెమాన్‌, నోబిత... పిల్లలకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేని పేర్లు ఇవి. పిల్లలను అమితంగా ఆకట్టుకున్న ఈ కార్టూన్‌ షో లేటెస్ట్‌ మూవీ వచ్చే నెలలో విడుదల కాబోతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డోరెమాన్‌, నోబిత... పిల్లలకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేని పేర్లు ఇవి. పిల్లలను అమితంగా ఆకట్టుకున్న ఈ కార్టూన్‌ షో లేటెస్ట్‌ మూవీ వచ్చే నెలలో విడుదల కాబోతోంది. 2014లో వచ్చిన ‘స్టాండ్‌ బై మి డోరెమాన్‌’కు సీక్వెల్‌గా ఈ చిత్రం రాబోతోంది. ‘స్టాండ్‌ బై మి డోరెమాన్‌-2’ పేరుతో వస్తోన్న ఈ మూవీ తాజా పోస్టర్‌ను సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. ప్రస్తుతం అది ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. డోరెమాన్‌ గ్యాడ్జెట్లతో నోబిత చేసే హంగామా అందరికీ తెలిసిందే. నోబిత తన మనసులో ఉన్న మాటను షిజుకాకు చెప్పలేకపోతుంటాడు.


 తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో నోబిత షిజుకను పెళ్లి చేసుకున్నట్టుగా వెడ్డింగ్‌ సెటప్‌ కనిపిస్తోంది. ఈ దృశ్యం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. నవంబర్‌లోనే జపాన్‌లో విడుదలైన ఈ మూవీ, వచ్చే నెలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Updated Date - 2021-01-22T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising