ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారిలో అతిథి ఎవరు?

ABN, First Publish Date - 2021-10-24T09:40:52+05:30

ఒకరోజు ఒక వ్యాపారవేత్త బీర్బల్‌ను భోజనానికి ఆహ్వానించాడు. ఆ ఆహ్వానాన్ని మన్నించి బీర్బల్‌ అతని ఇంటికి వెళ్లాడు. బీర్బల్‌ చేరుకునే సమయానికి ఆ ఇంట్లో చాలా మంది ఉన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కథ

ఒకరోజు ఒక వ్యాపారవేత్త బీర్బల్‌ను భోజనానికి ఆహ్వానించాడు. ఆ ఆహ్వానాన్ని మన్నించి బీర్బల్‌ అతని ఇంటికి వెళ్లాడు. బీర్బల్‌ చేరుకునే సమయానికి ఆ ఇంట్లో చాలా మంది ఉన్నారు. బీర్బల్‌ను చూసిన ఆ వ్యాపారవేత్త ఇంట్లోకి ఆహ్వానించాడు. ‘‘నాతో పాటు చాలా మందిని భోజనానికి ఆహ్వానించినట్టున్నారు’’ అన్నాడు బీర్బల్‌. ‘‘లేదు. వీళ్లు అతిథులు కాదు. నా దగ్గర పనిచేసే ఉద్యోగులు. అయితే ఇందులో ఒకరు మాత్రం అతిథి ఉన్నారు. అతనెవరో నువ్వు ఊహించగలవా?’’ అన్నాడు ఆ వ్యాపారవేత్త. ‘‘ఎవరినైనా ఒక జోక్‌ చెప్పమనండి. అతిథి ఎవరో నేను చెబుతాను’’ అన్నాడు బీర్బల్‌. ఆ ఉద్యోగుల్లో ఒక వ్యక్తి జోక్‌ చెప్పడంతో అందరూ పగలబడి నవ్వారు. అప్పుడు వారిలో ఒకరిని చూపిస్తూ అతనే అతిథి అన్నాడు బీర్బల్‌. ‘‘అవును. నువ్వు సరిగ్గా గుర్తించావు. ఎలా?’’ అన్నాడు వ్యాపారవేత్త ఆశ్చర్యంగా. ‘‘అందులో విశేషమేమీ లేదు. ఆ జోక్‌ నవ్వొచ్చేలా లేకున్నా అందరూ పగలబడి నవ్వారు. అతిథి మాత్రమే చిన్నగా నవ్వారు. వాళ్లు నీ ఉద్యోగులు కాబట్టి పగలబడి నవ్వారు’’ అని అన్నాడు బీర్బల్‌. 

Updated Date - 2021-10-24T09:40:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising