ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీర్బల్‌ తెలివి!

ABN, First Publish Date - 2021-03-07T05:30:00+05:30

బీర్బల్‌ను ఎలాగైనా ఫూల్‌ని చేయాలని అనుకున్నాడు అక్బర్‌. అందుకోసం ఒక పథకం రచించాడు. ఒకరోజు బీర్బల్‌ సభకు రాకముందు అందరి మంత్రులకు ఒక్కో కోడిగుడ్డు అందించాడు అక్బర్‌. బీర్బల్‌ సభకు చేరుకున్నాక ముందు రోజు రాత్రి తనకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీర్బల్‌ను ఎలాగైనా ఫూల్‌ని చేయాలని అనుకున్నాడు అక్బర్‌. అందుకోసం ఒక పథకం రచించాడు. ఒకరోజు బీర్బల్‌ సభకు రాకముందు అందరి మంత్రులకు ఒక్కో కోడిగుడ్డు అందించాడు అక్బర్‌. బీర్బల్‌ సభకు చేరుకున్నాక ముందు రోజు రాత్రి తనకు వచ్చిన కల గురించి వివరించాడు. మంత్రులందరూ నిజాయతీని నిరూపించుకోవాలంటే రాయల్‌ గార్డెన్‌లో ఉన్న కొలనులో నుంచి తలా ఒక కోడిగుడ్డును తీసుకురావాలని అన్నాడు. ‘‘మంత్రులందరూ వెంటనే వెళ్లి కొలనులో నుంచి కోడిగుడ్డును తీసుకురండి’’ అని ఆజ్ఞాపించాడు.  దాంతో మంత్రులు ఒక్కొక్కరు కొలను వద్లకు వెళ్లి, అక్బర్‌ ఉదయాన్నే ఇచ్చిన గుడ్డుతో తిరిగి వచ్చారు. తరువాత బీర్బల్‌ వంతు వచ్చింది. బీర్బల్‌ వెళ్లి కొలనులోకి దూకాడు. ఎంతసేపు వెతికినా గుడ్డు దొరకలేదు. దాంతో అదంతా రాజు గారి ప్లాన్‌ అని అర్థమయింది. వెంటనే కోడిపుంజులా అరుచుకుంటూ సభలోకి అడుగుపెట్టాడు. ఆ అరుపులు విన్న అక్బర్‌ ‘‘ఆ శబ్దం చేయడం ఆపి, నీవు తెచ్చిన కోడిగుడ్డు ఏదో చూపించు’’ అని అడిగాడు. అప్పుడు బీర్బల్‌ నవ్వుతూ ‘‘కోడిపెట్టలు మాత్రమే గుడ్లు పెడతాయి జహాపనా! నేను కోడిపుంజును. నేను గుడ్డుపెట్టను’’ అని సమాధానం ఇచ్చాడు.  ఆ సమాధానం విన్న అక్బర్‌ బిగ్గరగా నవ్వాడు. బీర్బల్‌ను ఫూల్‌ చేయడం అంత సులువు కాదని మనసులో అనుకున్నాడు.

Updated Date - 2021-03-07T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising