ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోపం శత్రువు లాంటిది!

ABN, First Publish Date - 2021-11-14T05:30:00+05:30

ఒక గ్రామంలో రాము అని పదేళ్ల బాలుడు ఉండేవాడు. అతడికి కోపం చాలా ఎక్కువ. ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక గ్రామంలో రాము అని పదేళ్ల బాలుడు ఉండేవాడు. అతడికి కోపం చాలా ఎక్కువ. ఆ కోపంలో రాము చేసే పనుల వల్ల తండ్రికి చెడ్డ పేరు వచ్చేది. ఆ కోపం తగ్గడానికి ఏదైనా చేయాలని అనుకున్నాడు  తండ్రి. ఒకరోజు రాముని పిలిచి కొన్ని మేకులు, సుత్తి ఇచ్చి ‘‘నీకు ఎప్పుడు కోపం వస్తే అప్పుడు ఇంటి చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌కు మేకులు కొట్టు’’ అని చెప్పాడు. మొదటిరోజు రాము సగం మేకులు కొట్టేశాడు. రెండు రోజు కొంచెం తక్కువ మేకులు కొట్టాడు. వారం రోజులు గడిచిన తరువాత కోపం నియంత్రణలోకి రావడంతో రోజులో రెండు, మూడు మేకులు మాత్రమే కొట్టాల్సిన అవసరం ఏర్పడింది. అది చూసిన తండ్రి రాముతో ‘‘ఇక నుంచి నీకు కోపం రాని ప్రతిరోజూ ఫెన్సింగ్‌కు కొట్టిన ఒక మేకును తొలగించు’’ అని చెప్పాడు. కొన్ని రోజుల తరువాత కొట్టిన మేకులన్నీ తొలగించడం పూర్తయింది. అది చూసిన తండ్రి ‘‘రాము చాలా బాగా చేశావు. కానీ ఆ ఫెన్సింగ్‌కు ఏర్పడిన రంధ్రాలు చూడు. ఆ ఫెన్సింగ్‌ ఎప్పటికీ గతంలో ఉన్నదానిలా కాలేదు. అలాగే కోపంలో నువ్వు చేసే పనులు కూడా మచ్చలుగా మిగిలిపోతాయి’’ అని చెప్పాడు. దాంతో రాము కోపం తగ్గించుకుని మంచి బాలుడిగా పేరు తెచ్చుకున్నాడు.

Updated Date - 2021-11-14T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising