ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిట్టిపొట్టి ద్వీపం... డొమినికా!

ABN, First Publish Date - 2021-06-03T05:30:00+05:30

నీరవ్‌ మోడీ, విజయ్‌ మాల్యా, మెహుల్‌ చోక్సీ... మిలియన్లకొద్దీ అప్పుల ఎగవేత కోసం విదేశాలకు పారిపోయిన ఘనులు వీళ్లు. ఇలా నీరవ్‌ మోడీ మేనమామ మెహుల్‌ చోక్సీ కూడా పారిపోయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నీరవ్‌ మోడీ, విజయ్‌ మాల్యా, మెహుల్‌ చోక్సీ... మిలియన్లకొద్దీ అప్పుల ఎగవేత కోసం విదేశాలకు పారిపోయిన ఘనులు వీళ్లు. ఇలా నీరవ్‌ మోడీ మేనమామ మెహుల్‌ చోక్సీ కూడా పారిపోయి, తల దాచుకోవడానికి ఓ మారుమూల దేశాన్ని ఎంచుకున్నాడు. అదే డొమినికా. దాంతో ఈ దేశం పేరు వార్తల్లో మారుమోగిపోతోంది. ఇంతకూ ఈ దేశం ఎక్కడుంది? ఏంటి దాని ప్రత్యేకత? 


డొమినికా... తూర్పు కరీబియన్‌ సముద్రంలో ఉన్న అతి చిన్న ద్వీప దేశం ఇది. 47 కిలోమీటర్ల పొడవు, 26 కిలోమీటర్ల వెడల్పు ఉండే డొమినికా మొత్తం జనాభా కేవలం 70 వేలు. డొమినికా క్యాపిటల్‌ ‘రోజే’ ప్రధాన నౌకాశ్రయం కూడా! 1978లో స్వతంత్రం పొందిన డొమినికాకు కామన్వెల్త్‌ సభ్యత్వం కూడా ఉంది. డొమినికా, డొమినికన్‌ రిపబ్లిక్‌... ఈ రెండు పేర్లు ఒకలాగే అనిపించినా, ఈ రెండూ కరీబియన్‌ సముద్రంలో ఉండే రెండు వేర్వేరు దేశాలు. 

బోలెడన్ని అగ్నిపర్వతాలు: డొమినికాలో లెక్కలేనన్ని అగ్నిపర్వతాలు ఉన్నాయి. కానీ అవి బద్దలైన సందర్భాలు అరుదు. అయితే చాలా చోట్ల వోల్కానిక్‌ వెంట్స్‌... అంటే.. అగ్నిపర్వతం ఆవిర్లు వెలువడే గుంతలు ఉంటాయి. మరిగే నీటి మడుగులు కూడా కనిపిస్తాయి. అలాంటి ఓ మడుగు సముద్ర మట్టానికి 2,500 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడి అడవుల్లో ఇంపీరియల్‌ ప్యారట్‌, రెడ్‌ నెక్క్‌డ్‌ ప్యారట్‌ అనే రెండు రకాల చిలుకలు ఉంటాయి. ఇవి డొమినికాలో తప్ప ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. 

Updated Date - 2021-06-03T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising