ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుడ్డుపై 45 వేల రంధ్రాలు!

ABN, First Publish Date - 2021-02-06T05:30:00+05:30

కాస్త గట్టిగా కొడితే కోడిగుడ్డు పగిలిపోతుంది. అలాంటి గుడ్డుకు కొన్ని వేల రంధ్రాలు చేయాలంటే ఎంత నేర్పు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాస్త గట్టిగా కొడితే కోడిగుడ్డు పగిలిపోతుంది. అలాంటి గుడ్డుకు కొన్ని వేల రంధ్రాలు చేయాలంటే ఎంత నేర్పు కావాలో ఆలోచించండి. 


 వియత్నాంలోని హనోయి చెందిన హంగ్‌ కుయాంగ్‌ అనే ఆర్టిస్టు ఆస్ట్రిచ్‌ గుడ్డుకు ఏకంగా 45,863 రంధ్రాలు చేసి రికార్డు సృష్టించాడు.


 ఆ గుడ్డుపై అన్ని రంధ్రాలు చేయడానికి అతనికి మూడేళ్ల సమయం పట్టింది. ఆ మూడేళ్లలో అతను ఎంతో జాగ్రత్తగా, ఓపికగా పని చేశాడు. ‘‘మొదటి రంధ్రం ఎంత ఓపికగా చేశానో, చివరి రంధ్రం చేసే సమయంలో కూడా అంతే ఓపికతో ఉన్నాను’’ అని అంటాడు హంగ్‌ కుయాంగ్‌.


 ఆ రంధ్రాలు ఎంత సూక్ష్మంగా ఉన్నాయంటే వాటిలో మనిషి వెంట్రుక కూడా దూరదు. అవి 0.2 మి.మీ వ్యాసంతో మనిషి వెంట్రుక కూడా దూరలేనంత చిన్నగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఎవరూ కూడా ఇంత సూక్ష్మంగా ఎగ్‌ కార్వింగ్‌ చేయలేదు.


 టర్కీకి చెందిన హమిత్‌ హయరన్‌ వ్యక్తి కోడిగుడ్డుకు 12,000 రంధ్రాలు చేసి గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. ఆ రికార్డు గురించి తెలుసుకున్న హంగ్‌ కుయాంగ్‌ తను కూడా అలాంటి రికార్డు సృష్టించాలనే ఉద్దేశంతో ఆస్ట్రిచ్‌ గుడ్డును ఎంచుకున్నాడు. 


 గుడ్డుపై చేసిన రంధ్రాలను హై రిజల్యూషన్‌ స్కానర్స్‌ సహాయంతో స్కాన్‌ చేసి లెక్కించారు.


Updated Date - 2021-02-06T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising