ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పార్క్‌ తగ్గకుండా...

ABN, First Publish Date - 2021-05-31T06:16:55+05:30

వర్క్‌ ఫ్రం హోంతో నెలల తరబడి ఇంటికే పరిమితమైన జంటల్లో ఉదాసీనత చోటుచేసుకోవడం సహజం. ఆఫీసులకు వెళ్లొస్తూ, వారాంతాల్లో మాత్రమే తీరిక సమయం చిక్కే కాలంలో దంపతుల మధ్య నెలకొని ఉండే ఆసక్తి, ఉత్సుకతలు వేరు. సంగతులు పంచుకోవాలనే తాపత్రయం, కలిసి సమ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్క్‌ ఫ్రం హోంతో నెలల తరబడి ఇంటికే పరిమితమైన జంటల్లో ఉదాసీనత చోటుచేసుకోవడం సహజం. ఆఫీసులకు వెళ్లొస్తూ, వారాంతాల్లో మాత్రమే తీరిక సమయం చిక్కే కాలంలో దంపతుల మధ్య నెలకొని ఉండే ఆసక్తి, ఉత్సుకతలు వేరు. సంగతులు పంచుకోవాలనే తాపత్రయం, కలిసి సమయం గడపాలనే ఆసక్తి ఇంటి పట్టునే గడిపే దంపతుల్లో తగ్గడం సహజమే! ఈ వాతావరణం తొలగిపోయి, దంపతుల మధ్య పూర్వపు స్పార్క్‌, అట్రాక్షన్‌ చోటుచేసుకోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి


కచ్చితమైన సమయాలు పాటించాలి: వర్క్‌ ఫ్రం హోంలో ఉన్నా పని సమయాన్ని కచ్చితంగా పాటించాలి. దంపతులిద్దరూ వర్క్‌ కోసం ఒకే సమయాలను పాటించాలి. ఇంట్లో భార్యాభర్తలు ఆఫీసు పని చేసే ప్రదేశాలు కూడా దూరదూరంగా ఉండాలి. వీలైతే వేర్వేరు గదులను ఆఫీసు పని కోసం కేటాయించుకోవాలి.


ఇండోర్‌ గేమ్స్‌: ఆఫీసు పని, ఇంటి పనితోనే సరిపెట్టుకోకుండా ఇద్దరూ కలిసి క్యారమ్స్‌, ప్లేయింగ్‌ కార్డ్స్‌, లూడో, చెస్‌ మొదలైన ఇండోర్‌ గేమ్స్‌ ఆడాలి. ఆటలతో ఒత్తిడి తొలగడంతో పాటు, కాలక్షేపం కూడా దక్కుతుంది. కలిసి నాణ్యమైన సమయం గడిపామనే సంతృప్తి కూడా దక్కుతుంది.


పాత జ్ఞాపకాలు: పెళ్లి నాటి ఫొటో ఆల్బమ్‌ను తిరగేస్తే పాత జ్ఞాపకాలతో మానసికోల్లాసం దక్కుతుంది. ఒకప్పటి గుర్తులు, సంఘటనలు కళ్ల ముందు మెదిలి, దంపతుల మధ్య దూరాలు తగ్గుతాయి.


సరదా సరదాగా: సరదా టెక్స్ట్‌ మెసేజీలు పంపుకుంటూ, ఒకర్నొకరు టీజ్‌ చేసుకుంటూ ఉండాలి. సరికొత్త వంటకాలతో భార్య భర్తనూ, ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి తెప్పించిన సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్‌తో భర్త భార్యనూ సర్‌ప్రైజ్‌ చేయవచ్చు.


పనుల్లో భాగస్వామ్యం: ఇంటి పనులు కలిసి చేయడం ద్వారా కూడా దంపతులు తమ మధ్య తగ్గే అన్యోన్యతను పెంచుకోవచ్చు. కూరగాయలు తరగడం, మిక్సీ, వాషింగ్‌ మెషిన్‌, గార్డెనింగ్‌ పనులతో భర్తలు భార్యలకు సహాయపడవచ్చు. అలాగే భార్యలు కూడా భర్తల పనుల్లో పాలుపంచుకోవచ్చు.

Updated Date - 2021-05-31T06:16:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising