ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాత పుస్తకాలతో లైబ్రరీ!

ABN, First Publish Date - 2021-01-25T07:12:21+05:30

పాత పుస్తకాలుంటే అమ్మేస్తుంటారు లేదా పడేస్తుంటారు. కానీ కొలంబియాలోని బొగొటకు చెందిన జోస్‌ అల్బెర్టో గుటిర్రెజ్‌ మాత్రం పడేసిన పుస్తకాలను ఏరి,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాత పుస్తకాలుంటే అమ్మేస్తుంటారు లేదా పడేస్తుంటారు. కానీ కొలంబియాలోని బొగొటకు చెందిన జోస్‌ అల్బెర్టో గుటిర్రెజ్‌ మాత్రం పడేసిన పుస్తకాలను ఏరి, ఇంటింటికీ తిరిగి పాత పుస్తకాలను సేకరించి ఒక గ్రంథాలయాన్ని ప్రారంభించాడు. 


పుస్తకాల విలువ తెలిసిన వ్యక్తి జోస్‌. అందుకే ఎక్కడ పుస్తకం కనిపించినా దాన్ని సేకరించి భద్రపరుస్తాడు. అలా సేకరించిన పుస్తకాలతో ఏకంగా ఒక గ్రంథాలయమే తయారయ్యింది.


ప్రస్తుతం జోస్‌ ఏర్పాటు చేసిన లైబ్రరీలో 25వేలకు పైగా పుస్తకాలున్నాయి. జోస్‌ ప్రైమరీ స్కూల్‌ వరకే చదువుకున్నారు. ఆ తరువాత ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలు వల్ల చదువుకోలేదు. కానీ పుస్తకాలంటే చాలా ఇష్టం. అందుకే  ఎక్కడ పుస్తకం కనిపించినా వదలడు. 


జోస్‌ రోజూ చెత్తను సేకరిస్తుంటాడు. ఒకరోజు చెత్తకుండీలో నుంచి చెత్తను తీస్తుండగా లియో టాల్‌స్టాయ్‌ రాసిన ‘అన్నా కరెనినా’ పుస్తకం దొరికింది. దాన్ని తీసి భద్రపరిచాడు. అప్పటి నుంచి పుస్తకాలు సేకరించడం మొదలుపెట్టాడు. జోస్‌ ఏర్పాటు చేసిన గ్రంథాలయంలో ఉచితంగా పుస్తకాలు చదువుకోవచ్చు. స్థానికులు జోస్‌ని ‘లార్డ్‌ ఆఫ్‌ ద బుక్స్‌’ అని పిలుస్తుంటారు. 

Updated Date - 2021-01-25T07:12:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising