ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సొగసు చిట్కాలు అమ్మను చూసి నేర్చుకున్నా!

ABN, First Publish Date - 2021-04-29T05:30:00+05:30

నటనతో పాటు సరికొత్త ఫ్యాషన్‌తోనూ అభిమానులను అలరిస్తున్న శ్రద్ధా కపూర్‌ ఈ మధ్య ఒక ఈమెయిల్‌ ఇంటర్వ్యూలో తన సౌందర్య రహస్యాన్ని వివరించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నటనతో పాటు సరికొత్త ఫ్యాషన్‌తోనూ అభిమానులను అలరిస్తున్న శ్రద్ధా కపూర్‌ ఈ మధ్య ఒక ఈమెయిల్‌ ఇంటర్వ్యూలో తన సౌందర్య రహస్యాన్ని వివరించారు. తన చర్మంతత్వం, మేకప్‌ గురించి కూడా ఈ బాలీవుడ్‌ నటి ఏమంటున్నారంటే... 


‘‘చర్మ సంరక్షణలో ‘అవసరమైన జాగ్రత్తలు చాలు’ అనేది నా మంత్ర. ఈ అలవాటును మా అమ్మను చూసి నేర్చుకున్నా. ఒకేసారి ఎక్కువ సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించను. తేలికైన మాయిశ్చరైజర్‌ ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం, ఎక్కువ నీళ్లు తాగడం నా చర్మాన్ని సొగసుగా మార్చుతాయి. నాది కాంబినేషన్‌ స్కిన్‌. అందువల్ల తరచూ మొటిమలు, నల్లమచ్చలు వస్తుంటాయి. ఈ ఐస్‌ ముక్కల మసాజ్‌ నా చర్మానికి చక్కగా పనిచేస్తుంది. ఆహారం, అలవాట్లను పద్ధతిగా పాటిస్తే నా చర్మం, కురులు, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. 


సమతులాహారం తింటా

చర్మం మెరుస్తూ ఉండడానికి విటమిన్లు ఎంత అవసరమో నాకు తెలుసు. అందుకే ఆహారం ద్వారా విటమిన్లు అందేలా చూసుకుంటాం. మేకప్‌ విషయానికొస్తే మాయిశ్చరైజర్‌ నా బెస్ట్‌ ఫ్రెండ్‌. కాటుక, కొద్దిగా కన్‌సీలర్‌, టిన్టెడ్‌ లిప్‌బామ్‌ను ఇష్టపడతా. ఇక జుట్టు, గోళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు నా వేగన్‌ డైట్‌ ఎంతో తోడ్పడుతుంది. అంతేకాదు సమతులాహారం ఎక్కువగా తింటాను’’.


Updated Date - 2021-04-29T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising