ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భాష మారుతోంది!.. కాబోయే భార్యను ఏమని పిలుస్తున్నారంటే...

ABN, First Publish Date - 2021-05-18T16:39:46+05:30

‘ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి...’ అని ‘మాయాబజార్‌’ సినిమాలో ఘటోత్కచుని పాత్రధారి ఎస్‌వీఆర్‌ వ్యాఖ్యానిస్తారు. ఆ వ్యాఖ్యల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వినూత్న పదాలను సృష్టిస్తోన్న నవతరం
  • డిక్షనరీ సైట్లలో ప్రత్యేకంగా కరోనా కాలపు పదాలంటూ సూచికలు 
  • సామాజిక మాధ్యమాలలోనూ అవే పదాలు

హైదరాబాద్ : ‘ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి...’ అని ‘మాయాబజార్‌’ సినిమాలో ఘటోత్కచుని పాత్రధారి ఎస్‌వీఆర్‌ వ్యాఖ్యానిస్తారు. ఆ వ్యాఖ్యల స్ఫూర్తిని నాటి తరం ఎంతగా ఆచరించిందో తెలియదు కానీ నేటి తరం మాత్రం తు.చ తప్పకుండా అనుసరిస్తోంది. వాటికి ప్రాచుర్యమూ కల్పిస్తోంది. లేదంటే సామాజిక మాధ్యమాలలో సంక్షిప్తీకరణ కోసం వినియోగించిన ఓఎంజీ (ఓ మై గాడ్‌), వీక్‌ సాస్‌ (నువ్వేసిన జోక్‌ నవ్వు తెప్పించలేదు) లాంటి పదాలు తరువాత కాలంలో పలు డిక్షనరీలలో చేరడం ఊహించగలమా? ఇక కరోనా కాలంలో జీవితాలే మారిపోతున్న వేళ భాష మారటం పెద్ద సమస్యా? కరోనా ఆరంభమైన సంవత్సర కాలంలో నర్సుల కోసం కొన్ని వైద్య పరిభాషా పదాల పట్ల ఆస్పత్రులలో శిక్షణ ఇస్తున్నారు. కానీ సామాజిక మాధ్యమ భాషా పండితులకు ఆ శిక్షణతో అవసరమేముంది? అస్మదీయులు అనే పదాన్ని సినిమాలో ఘటోత్కచుని సైనికులు అసమదీయులు అని సాగదీయడంతో పాటుగా అస్మదీయులకు వ్యతిరేకులు తస్మదీయులు అని సృష్టించినట్లు నేటి సామాజిక మాధ్యమాల పండితులు కూడా సరికొత్త పదాలను సృష్టిస్తున్నారు. 


బంగారు తెలంగాణ వాదులను బీటీ బ్యాచ్‌ అని రాజకీయ నాయకులు గతంలో విమర్శించారు. కానీ కరోనా కాలంలో బీటీ అంటే బీఫోర్‌టైమ్స్‌గా మారిపోయింది.  కరోనా కాలంలో జీవితం రోలర్‌కోస్టర్‌ రైడ్‌లా మారిపోతుందని ఇప్పుడు నవతరం అనడం లేదు... కరోనా కోస్టర్‌గా మారిపోయిందంటున్నారు. మాస్కుల్లేకుండా రోడ్లమీద తిరిగే ఇడియట్స్‌ కాస్తా కొవిడియట్స్‌గా మారిపోయారు. అంతేనా, కరోనాకు కాస్త హాస్యం, అంతే వంగ్యం జోడించి కరోనా కాలంలో కొత్త పదాలను సృష్టిస్తున్నట్లే వర్క్‌ఫ్రమ్‌హోమ్‌, లాక్‌డౌన్‌, కరోనా హాలీడే్‌సల పేరిట ఇంటిలోనే దాదాపు సంవత్సర కాలంగా గడుపుతున్న కుర్రకారు సామాజిక మాధ్యమాలలో తమవైన రహస్యాలను వెల్లడించుకోవడానికి సరికొత్త పదాలనూ సృష్టించారు. 


సృష్టించేదీ వారే... ఆచరించేదీ వారే..!

సామాజిక మాధ్యమాల కాలంలో కొత్త పదాలను సృష్టించేది, ఆచరించేదీ నవతరమే! కాలేజీలు జరుగుతున్న కాలంలో చిల్లాక్స్‌ (రిలాక్స్‌), బైట్‌ (పట్టుబడే ప్రమాదం), హార్డ్‌కోర్‌ (శక్తివంతమైన), అగ్లిఫైడ్‌(గడిచే కొద్దీ ఛండాళంగా తయారుకావడం), వాంకస్టా(విఫల ప్రయత్నం), మైబ్యాడ్‌ (నా తప్పు), 86 డీ (ప్లాన్‌ క్యాన్సిల్‌ అయింది), ఐస్డ్‌ ఔట్‌ (జ్యువెలరీ లేదా యాక్ససరీలు ఎక్కువగా ధరించిన వారిపై ప్రయోగించే పదం) అంటూ వినూత్న పదాలు సృష్టించి సామాజిక మాద్యమాలలో హంగామా సృష్టించిన నవతరం ఇప్పుడు కరోనా మొదలు వ్యక్తుల వరకూ ప్రతి ఒక్కరినీ ఉద్దేశించి పదాలను సృష్టించి వదిలారు. సాధారణంగా ఆ రోజుల్లో అని మొదలు పెట్టే పెద్దవారిని చూస్తే ‘అబ్బో మొదలెట్టేశారు..’ అని మిల్లీనియల్‌ తరం అనేదేమో కానీ జెన్‌ జెడ్‌ తరం మాత్రం సింపుల్‌గా ‘ఓకే బూమర్‌’ అంటూ దాటేస్తోంది. దాదాపు సంవత్సర కాలంగా ఇంట్లోనే ఉంటున్న నవతరం కుటుంబసభ్యులతో అనుబంధం ఏర్పరుచుకున్నది ఎంతో కానీ సోషల్‌ మీడియాతో ఉన్న అనుబంధం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


ఈ సోషల్‌ మీడియాలో ఇప్పుడు ఎఫ్‌ఆర్‌ (ఫర్‌ రియల్‌), అండ్‌ ఐ ఊప్‌ (అకస్మాత్తుగా జరిగే పొరపాటును సూచిస్తూ వాడుతున్నారు) లాం టి పదాలూ విరివిగా వాడుతున్నారు. ఇక ఎంతసేపూ ఫోన్‌లలో చాటింగ్‌ చేసే నవతరం సీడీ9(మా అమ్మానాన్నలు పక్కనే ఉన్నారని టీనేజర్లు సిగ్నల్స్‌ ఇవ్వడం), పీఓఎస్‌ (పేరెంట్స్‌ ఓవర్‌ షోల్డర్‌- మా అమ్మనాన్నలు ఇక్కడే చాలా సేపుగా ఉన్నారని తెలుపడం) అంటూ షార్ట్‌కట్స్‌ వాడుతూనే నెట్‌ఫ్లిక్స్‌ అండ్‌ చిల్‌ అంటూ కూడా స్నేహితులకు తమ ఘనకార్యం చెబుతున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ అండ్‌ చిల్‌ అంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ముందు పాప్‌కార్న్‌ పెట్టుకుని ఆనందిస్తున్నామని చెప్పడం కాదు తమతో పాటుగా తమకు నచ్చిన వారు కూడా ఎదురుగానే ఉన్నారు. లేదంటే వారింటికి వెళ్లి ఫుల్‌ ఎంజాయ్‌ చేశామని చెప్పడం. యువతరం ఈ కోడ్‌ భాషను చూసి అధ్యయనం చేయడం ప్రారంభించిన లండన్‌లోని కింగ్స్‌ కాలేజీ పరిశోధకులు ఈ మహమ్మారి ఆరంభమైన తరువాత 1000కు పైగా కొత్త పదాలు పుట్టుకొచ్చాయని చెబుతున్నారు. ఇక డిక్షనరీ డాట్‌ కామ్‌ అయితే అధికారికంగా కరోనా వైరస్‌ నిఘంటువునూ సృష్టించింది. కరోనాతో కొన్నాళ్లు సహజీవనం చేయడం తప్పదేమో కానీ కరోనా కాలంలో పుట్టుకువచ్చిన ఈ పదాలు మాత్రం మన వ్యవహారిక భాషలో సాధారణమై పోతాయేమో..!


వినదగు నెవ్వరు చెప్పినా...

కరోనా... అనగానే చాలామందికి బీరే గుర్తొచ్చింది తొలినాళ్లలో. ఆ తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవిడ్‌-19గా దీనికి నామకరణం చేసి, అలాగే పలుకమని కోరడంతో ఇప్పుడు కొవిడ్‌-19గా పిలుస్తున్నారు. కానీ ఈ సంవత్సరకాలంలో గతంలో సాధారణ ప్రజలు ఎన్నడూ వినని పదాలను తరచూ వినడం కూడా కనిపిస్తోంది. అంతేనా, ప్రతి ఒక్కరూ ఆ నామాలనే జపించడమూ కనిపిస్తోంది. ఉదాహరణకు లాక్‌డౌన్‌! తాళం వేయడం /తీయడం తెలుసు . కానీ ఈ లాక్‌డౌన్‌ ఏమిటిరా బాబూ అని చాలామంది ఆశ్చర్యపోయారు. గత సంవత్సరం ఈ పదం గురించి చర్చకు వచ్చిన తొలినాళ్లలో! ఇక ఆ తరువాత సోషల్‌ డిస్టెన్సింగ్‌, క్వారంటైన్‌, ఐసోలేషన్‌...ఇలా ఎన్నో పదాలు వినడమూ జరుగుతోంది. 


అవన్నీ శాస్త్రం పుట్టించిన పదాలు. మరి తమదైన హాస్యం జోడించకపోతే సోషల్‌మీడియా జనులకు పొద్దు గడిచేది ఎలా? అందుకే ఇప్పుడు కొవర్జిన్‌ (ఇప్పటి వరకూ కొవిడ్‌ బారిన పడని వ్యక్తులు), కరోనా బేబీస్‌ (కరోనా కాలంలో పుట్టిన శిశువులు), కొవెక్జిట్‌ (కొవిడ్‌-19 ప్రభావం నుంచి నెమ్మదిగా బయటపడటం), కరోనాకేషన్‌ (కొవిడ్‌ నిబంధనల కారణంగా ఇంట్లోనే ఎక్కువ కాలం ఉండిపోవడం), కొవిడియోపార్టీ (వర్చ్యువల్‌ టెలివిజన్‌ లేదంటే మూవీ వీక్షణ పార్టీ), ఎల్బో బంప్‌ (మోచేతులు ఆనించి అభినందనలు తెలుపడం) వంటి పదాలు సృష్టించి వదిలారు. ఈ సంవత్సర కాలంలో సోషల్‌ మీడియాలో మాత్రమే కాదు కొంతమంది డాక్టర్లు, ప్రొఫెసర్ల నోటి వెంట కూడా ఇవి వెలువడుతున్నాయి.


ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో అధికంగా కనిపిస్తోన్న పదాలు...

క్లౌట్‌ : ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ ప్రకారం ఇతరులు లేదంటే కార్యక్రమాలపై తమ శక్తి, ప్రభావం చూపే వ్యక్తులను సూచిస్తూ వాడే పదం. సాధారణంగా యూట్యూబ్‌ ఇన్‌ఫ్లూయోన్సర్స్‌ను సంబోధిస్తుంటారు. కానీ ఇప్పుడు మోదీ లాంటి రాజకీయ నాయకులను సంబోధించడానికీ వాడుతున్నారు.

బ్లర్స్‌ డే: క్వారంటైన్‌లో ఉన్నవారికి ఈ రోజు ఏ రోజు అనేది కూడా తెలియడం లేదనే అర్థంలో వాడుతున్నారు.

బీసీవీ, ఏసీవీ: గతంలో కాలాన్ని సూచించడానికి బీసీ, ఏడీ అంటూ వాడే వారు. కానీ ఇప్పుడు బీసీవీ, ఏసీవీ అని చెప్పాలనే భావనలో వాడుతున్నారు. 

ఫిన్‌స్టా : ఇంటిలోనే ఉంటున్న టీనేజర్లు వాడుతున్న పదం. తమ ఇన్‌స్టా ఖాతాలను ఎక్కడ తల్లిదండ్రులు పరిశీలిస్తారో అంటూ అధికారికంగా ఒకటి అనధికారికంగా మరో ఖాతా తెరిచిన నవతరం తమ స్నేహితులతో ఈ పదం వాడుతుంది.

ఐ యామ్‌ డెడ్‌ : నవ్వుతో చచ్చిపోతున్నామనేదానికి సూచికగా చాటింగ్‌లలో వాడుతున్నారు


కరోనా బీ : గతంలో కాబోయే భర్త/భార్య గురించి ఉడ్‌బీ .. అని చెప్పేవారేమో... కానీ ఇప్పుడు కరోనా బీ అంటూ తమతో పాటుగా క్వారంటైన్‌లో ఉన్నవారిని పిలుస్తున్నారు. 


కొవిడియెంట్‌ : ఒబిడియెంట్‌ విద్యార్థుల్లా కొవిడ్‌కు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలన్నీ తు.చ.తప్పకుండా ఆచరించే వారిని పిలుస్తున్నారు.

కరోనాకట్‌/క్వార్‌కట్‌ : లాక్‌డౌన్‌ లేదంటే కరోనా భయాలతో ఇంటిలోనే హెయిర్‌కట్‌ చేసుకోవడాన్ని సంబోధిస్తున్నారు.

లాక్‌టైల్‌ హవర్‌: పబ్‌గోయర్స్‌ సృష్టించుకున్న పదం. ఛీర్స్‌ చెప్పకుండా గ్లాస్‌ ముట్టమనుకునే స్నేహితులు వీడియో కాల్స్‌లో మందు పుచ్చుకుంటూ వేడుక చేసుకునే సందర్భమిది.

స్లే : అద్భుతమైన పని చేసిన వారిని పొగడడానికీ లేదంటే అందంగా ఉన్న వారిని పొగడటానికి వాడుతున్నారు.

రోనా : తమ వేసవి ప్రణాళికలన్నీ రద్దయ్యాయనే భావనలో సోషలైట్స్‌ వాడుతున్నారు.

Updated Date - 2021-05-18T16:39:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising