ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భాషలతో బుర్ర లెస్స!

ABN, First Publish Date - 2021-02-25T05:49:00+05:30

మాతృభాషకే పరిమితమైన పిల్లలతో పోలిస్తే, మాతృభాషతో పాటు అదనపు భాషలు నేర్చుకున్న పిల్లలు రెట్టింపు చురుగ్గా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాతృభాషకే పరిమితమైన పిల్లలతో పోలిస్తే, మాతృభాషతో పాటు అదనపు భాషలు నేర్చుకున్న పిల్లలు రెట్టింపు చురుగ్గా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే! కాబట్టి పిల్లలకు ఇతర భాషలు నేర్పించడం మీద తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి.


 బాల్యంలోనే:  మూడేళ్ల లోపు పిల్లలు తేలికగా కొత్త భాషను నేర్చుకోగలుగుతారు. కాబట్టి పెద్దలు ఆ వయసులోపే పిల్లలకు కొత్త భాష మీద పట్టు ఏర్పడేలా చేయాలి.


 ప్రతిభ మెరుగు: కొత్త భాష నేర్చుకునే క్రమంలో మెదడు చురుగ్గా తయారవుతుంది. కాబట్టి పిల్లలు తెలివితేటల్లో ముందుండాలంటే వాళ్లకు కొత్త భాష నేర్పించాలి. కొత్త భాషతో పిల్లల ఆలోచనాశక్తి, తెలివితేటలు పెరుగుతాయి.


 మల్టీటాస్కింగ్‌: ఒకే సమయంలో రెండు అంతకంటే ఎక్కువ భాషల మీద పట్టు ఏర్పరుచుకోవడం మూలంగా పిల్లల్లో మల్టీటాస్కింగ్‌ ప్రతిభ పెరుగుతుంది. ఫలితంగా ఏకకాలంలో ఎక్కువ పనులను సమర్థంగా పూర్తి చేయగలిగే స్వభావం ఏర్పడుతుంది.


ప్రపంచజ్ఞానం: వేర్వేరు భాషల మీద పట్టు ఏర్పడడం మూలంగా పిల్లలకు ఆయా సంస్కృతులు, చరిత్రల పట్ల అవగాహన కూడా ఏర్పడుతుంది. తద్వారా విజ్ఞానమూ అందుతుంది.


Updated Date - 2021-02-25T05:49:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising