ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంటింటి చిట్కాలు ఇలా చేసి చూడండి!

ABN, First Publish Date - 2021-04-15T05:30:00+05:30

అరటిపండ్లు కవర్‌లో పెడితే నిల్వ ఉండవు. అలా కాకుండా ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే వాటిని బయటకు తీసి ఒకే దగ్గర గుత్తిగా పెట్టకుండా విడివిడిగా పెట్టాలి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అరటిపండ్లు కవర్‌లో పెడితే నిల్వ ఉండవు. అలా కాకుండా ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే వాటిని బయటకు తీసి ఒకే దగ్గర గుత్తిగా పెట్టకుండా విడివిడిగా పెట్టాలి. 


ఆకుకూరలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే పేపర్‌లో చుట్టి పెట్టాలి. టిష్యూ పేపర్‌ కూడా వాడొచ్చు. దీనివల్ల తేమ మొత్తం తగ్గిపోయి ఆకుకూరలు తాజాగా ఉంటాయి. 

ఇంట్లో తయారుచేసిన కేక్‌ ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే కేక్‌పైన కొన్ని కట్‌ చేసిన బ్రెడ్‌ ముక్కలు ఉంచాలి. అలాగే కేక్‌ను నీట్‌గా కట్‌ చేయాలంటే కత్తిని కొద్దిసేపు వేడినీళ్లలో పెట్టి తీయాలి. తరువాత శుభ్రంగా తుడిచి కేక్‌ను కట్‌ చేస్తే సులభంగా, నీట్‌గా కట్‌ అవుతుంది. 

బంగాళదుంప కూర చేస్తున్నట్లయితే చాలా సమయం వాటి తొక్క తీయడానికే పోతుంది. అయితే బంగాళదుంపలు చల్లని నీటిలో వేసినట్లయితే వాటి తొక్క సులువుగా ఊడిపోతుంది.

కోడిగుడ్లు ఉడికించి తరువాత వాటిని ఒక డబ్బాలో వేసి ఊపాలి. ఇలా చేయడం వల్ల కోడిగుడ్ల పెంకులన్నీ పగులుతాయి. దీంతో సులభంగా, త్వరగా పెంకు తీసేయవచ్చు.

Updated Date - 2021-04-15T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising