ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్‌ సినిమా నిర్మాతగా కంగనా

ABN, First Publish Date - 2021-05-02T05:55:49+05:30

వైవిధ్యమైన పాత్రల్లో మెప్పిస్తూ బాలీవుడ్‌ క్వీన్‌గా ఎదిగిన కంగనా రనౌత్‌ వెబ్‌సినిమా నిర్మాతగా మారనున్నారు. మణికర్ణిక సినిమాతో సహాయ దర్శకురాలిగా మెగాఫోన్‌ పట్టిన కంగనా తనకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైవిధ్యమైన పాత్రల్లో మెప్పిస్తూ బాలీవుడ్‌ క్వీన్‌గా ఎదిగిన కంగనా రనౌత్‌ వెబ్‌సినిమా నిర్మాతగా మారనున్నారు. మణికర్ణిక సినిమాతో సహాయ దర్శకురాలిగా మెగాఫోన్‌ పట్టిన కంగనా తనకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన ఆ సినిమా పేరుతోనే ‘మణికర్ణిక ఫిలిమ్స్‌’ను అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారామె. శనివారం నిర్మాణ సంస్థ లోగోను విడుదల చేశారు. ‘టీకూ వెడ్స్‌ షేరూ’ వెబ్‌ సినిమాతో కంగనా వెబ్‌ నిర్మాతగా కొత్త ప్రయాణం మొదలెట్టనున్నారు.


‘‘టీకూ వెడ్స్‌ షేరూ’ సినిమాతో ‘మణికర్ణిక ఫిలిమ్స్‌’ డిజటల్‌ స్పేస్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ చిత్రంలో ప్రేమ, వ్యంగ్యంతో పాటు డార్క్‌ కామెడీ ప్రధానంగా ఉన్నాయి. వెబ్‌సినిమాలో మేము కొత్తరకం కథలను, ఎక్కువ ప్రాజెక్టులను తేవాలనుకుంటున్నాం. కొత్తవాళ్లను ప్రోత్సహిస్తూ, కొత్త కథలను ప్రేక్షకులకు అందించేందుకు ప్రయోగాలు చేసేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. థియేటర్‌కు వెళ్లే ప్రేక్షకుల కన్నా డిజటల్‌ తెరపై సినిమాలు చూసే వారు కొంత ఎక్కువ ఎక్స్‌పోజర్‌ ఉన్న వారని భావిస్తున్నా‘‘ అంటున్న కంగన చేతిలో తేజస్‌, ఇందిరా గాంఽధీ బయోపిక్‌, మణికర్ణిక రిటర్న్స్‌ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి.


Updated Date - 2021-05-02T05:55:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising