ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంచనార గుగ్గులు

ABN, First Publish Date - 2021-04-06T06:13:56+05:30

ఆయుర్వేద వైద్యశాస్త్రంలోని గలగండ, గుల్మము, వ్రణ మొదలైన రోగాల చికిత్సలో ఎక్కువగా ఉపయోగంలో ఉన్నవాటిలో కాంచనార గుగ్గులు ఒకటి. ఈ మందు తయారీ, ఉపయోగాల గురించి, ఆయుర్వేద శాస్త్రగ్రంథాలైన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆయుర్వేద వైద్యశాస్త్రంలోని గలగండ, గుల్మము, వ్రణ మొదలైన రోగాల చికిత్సలో ఎక్కువగా ఉపయోగంలో ఉన్నవాటిలో కాంచనార గుగ్గులు ఒకటి. ఈ మందు తయారీ, ఉపయోగాల గురించి, ఆయుర్వేద శాస్త్రగ్రంథాలైన భావప్రకాశ, బైషజ్యరత్నావళి, ఆంధ్రబైషజ్యరత్నావళి మొదాలైన గ్రంధాల్లో వివరంగా చెప్పబడింది.


కాంచనార గుగ్గులు తయారీలో ముఖ్యంగా ఉండేది కాంచనార, కాంచనారని, కాంచనపు చెట్టు దేవకాంచనార అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు బెరడును ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. కాంచనారగుగ్గులు తయారీలో కాంచనపు చెట్టు బెరడుతో పాటు త్రికటు, త్రిఫల, తేజ్‌పత్రి, యాలుక, దాల్చిన, శుద్ధి చేసిన గుగ్గూలం మొదలైన వాటి సంకలనంతో తయారుచేస్తారు. 

ఔషధాన్ని గలగండ (గాయిటర్‌), అర్బుద (మాలిగ్నెంట్‌ ట్యూమర్‌), గ్రంధి (సిస్ట్‌), వ్రణం (వూండ్‌, అల్సర్‌), గుల్మ (అబ్డామినల్‌ లంప్‌), కుష్ఠు మరియు భగంధరం (ఫిస్టులా) మొదలైన వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా మధుమేహ రోగుల్లో వచ్చే గ్యాంగ్రీన్‌ చికిత్సలో ఈ ఔషధం విశేషంగా పనిచేస్తుంది.

ఉపయోగించే మోతాదు: పెద్దలు రెండు మాత్రలు, పిల్లలు ఒక మాత్ర నీటిలో కలిపి తీసుకోవాలి. లేదా వైద్యుల సూచన మేరకు తీసుకోవాలి. ప్రస్తుతం ఈ మందును దూద్‌పాపేశ్వర్‌, బైద్యనాధ్‌, జండూ మొదలైన ఆయుర్వేద సంస్థలు తయారుచేస్తున్నాయి.

జి. శశిధర్‌, 

అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు,

సనాతన జీవన్‌ ట్రస్ట్‌,

కొత్తపేట, చీరాల.

Updated Date - 2021-04-06T06:13:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising