తక్షణ శక్తినిచ్చే మునగాకు పొడి
ABN, First Publish Date - 2021-06-10T05:30:00+05:30
మునగాకును పొడి రూపంలో తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలన్నీ అందుతాయి. మునగాకు పొడి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవి...
మునగాకును పొడి రూపంలో తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలన్నీ అందుతాయి. మునగాకు పొడి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవి...
- మునగాకులో ఫైబర్ అధికంగా ఉంటుంది. క్లోరోజెనిక్ యాసిడ్ అని పిలిచే యాంటీ ఆక్సిడెంట్ మునగాకుల్లో లభిస్తుంది. ఇది సహజసిద్ధంగా కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తంలో షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉండేలా చూస్తుంది. డయాబెటిస్ రోగులకు ఇది మంచి ఆహారం.
- మునగాకు పొడి తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ఇందులో ఉండే ఐరన్, మెగ్నీషియం అలసటను, నీరసాన్ని దూరం చేస్తాయి.
- శరీరంలో ఉన్న మలినాలు వేగంగా బయటకు పంపడంలో మునగాకు పొడి సహాయపడుతుంది. కాలేయంతో పాటురీరవ్యవస్థ మొత్తం శుభ్రపడుతుంది.
- మునగాకు పొడి మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. జీర్ణసంబంధ సమస్యలు దూరమవుతాయి.
- మునగాకులో విటమిన్-ఎ ఎక్కువగా ఉంటుంది. శిరోజాల ఆరోగ్యానికి అవసరమైన కెరాటిన్ ఏర్పడటానికి ఇందులో ఉండే అమైనో యాసిడ్స్ సహాయపడతాయి.
- మునగాకు మూడ్ బూస్టర్‌గానూ పనిచేస్తుంది. శరీరంలో ఫీల్‌గుడ్ హార్మోన్లను స్టిమ్యులేట్ చేస్తుంది. ఇందులో ఉండే అమైనో యాసిడ్ ట్రిప్టోఫాన్, సెరటోనిన్, మెలటోనిన్ ఉత్పత్తికి చాలా అవసరం.
Updated Date - 2021-06-10T05:30:00+05:30 IST