ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యవ్వనంగా కనిపించాలంటే...

ABN, First Publish Date - 2021-06-19T05:30:00+05:30

బాలీవుడ్‌ సెలబ్రిటీ శిల్పాశెట్టి వయసు నలభై ఆరు దాటింది. అయినప్పటికీ ఆమె యంగ్‌లుక్‌లో కన్పిస్తోంది. ఇలా వయసుదాటినా కొందరు యూత్‌ఫుల్‌గా కనిపిస్తుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌ సెలబ్రిటీ శిల్పాశెట్టి వయసు నలభై ఆరు దాటింది. అయినప్పటికీ ఆమె యంగ్‌లుక్‌లో కన్పిస్తోంది. ఇలా వయసుదాటినా కొందరు యూత్‌ఫుల్‌గా కనిపిస్తుంటారు. ఇలా ఉండటానికి రహస్యమేంటీ...


నలభై ఏళ్లు దాటినా చర్మం ముడతలు పడకుండా కాంతివంతంగా ఉందంటే ఖచ్చితంగా మంచి ఆహారం తీసుకోవడం, బ్యాలెన్స్‌గా ఉండే జీవన విధానమే కారణం. బాహ్యశరీరానికి క్రీములు, పౌడర్లు పూసి మేకప్‌ వేయొచ్చు కానీ అంతర్గత సౌందర్యానికి అలా చేయలేం. పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడం, కంటినిండా నిద్ర ఉంటేనే శిల్పాశెట్టిలా అందాన్ని అలానే మెయిన్‌టైన్‌ చేయడానికి వీలుంటుందని బ్యూటీ స్పెషలిస్టులు అంటున్నారు. ఆ మాటకొస్తే శిల్పాశెట్టినే కాదు నలభై పదుల్లో ఉండే వారు యోగా, వాకింగ్‌, ప్రాణాయామ, ఎక్సర్‌సైజ్‌లు చేస్తే ఖచ్చితంగా శరీరంలో మార్పొస్తుంది. శారీరకశ్రమను కలిగించే వీటితో పాటు మంచి ఆహారం తీసుకోవాలి. 


ఎమోషనల్‌గా బావుండాలంటే మాత్రం నిద్ర తప్పనిసరి. నిద్ర సరిగా లేకుండా శరీరాన్ని అదుపులో ఉంచుకోవటం కష్టం. 


ఆహారంలో జాగ్రత్తలు

విత్తనాలు, గింజలు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవటంతో పాటు ఆయిల్‌ఫుడ్‌, మసాలాలు, జంక్‌ఫుడ్‌ లాంటి వాటికి దూరంగా ఉంటేనే చర్మం కాంతివంతంగా ఉంటుంది. చక్కెర, ప్రాసె్‌సఫుడ్‌, ఆర్టిఫిషియల్‌ రంగులు వేసిన ఆహారానికి దూరంగా ఉండాలి. రోజుకు కనీసం గంట వ్యాయామం చేయాలి. ఏడు గంటలు ఖచ్చితంగా నిద్రకు కేటాయించాలి. ఇలా ఉన్నప్పుడే ఎనర్జీగా, యూత్‌ఫుల్‌గా కనిపిస్తారు. 

Updated Date - 2021-06-19T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising