ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాలుక తేడాగా ఉంటే...

ABN, First Publish Date - 2021-03-16T05:30:00+05:30

రుచిని కోల్పోవడం కొవిడ్‌ లక్షణాల్లో ఒకటనే విషయం తెలిసిందే! దీంతో పాటు నాలుకకు సంబంధించిన మరికొన్ని లక్షణాలను కూడా అనుమానించాలి. అవేమిటంటే....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రుచిని కోల్పోవడం కొవిడ్‌ లక్షణాల్లో ఒకటనే విషయం తెలిసిందే! దీంతో పాటు నాలుకకు సంబంధించిన మరికొన్ని లక్షణాలను కూడా అనుమానించాలి. అవేమిటంటే....

నోరు పొడిబారడం: నోరు, నాలుక పొడిబారడం వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ ప్రధాన లక్షణం. కాబట్టి కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌లో కూడా ఈ లక్షణం కనిపించే వీలుంది. డీహైడ్రేషన్‌, కొన్ని రకాల మందుల ప్రభావం,  చెడు ఆహారపుటలవాట్ల వల్ల నోరు, నాలుక పొడిబారుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా నాలుక పొడిబారితే చిగుళ్ల ఇన్‌ఫెక్షన్లు, పెదవుల పగుళ్లు, నాలుక మీద పుండ్లు వంటి ఇబ్బందులు కూడా మొదలవుతాయి. 


రుచి మారడం: రుచిమొగ్గల్లో తేడా ‘డిస్‌గేసియా’ లక్షణం కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌లో కూడా కనిపించవచ్చు. నోటిలో లోహపు రుచి, పదార్థాల సహజ రుచికి బదులుగా ఇతరత్రా రుచులు తెలియడం కూడా వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ లక్షణమే!


నాలుక స్పర్శ: కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌లో నాలుక మంట, వాపు కూడా కనిపించే అవకాశం ఉంది. పెదవులు, నాలుక తిమ్మిర్లు  పట్టడం కూడా జరగవచ్చు.


రంగు మారడం: ఆరోగ్యకరమైన నాలుక గులాబీ రంగులో ఉంటుంది. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకితే నాలుక రంగు తగ్గి, ఎగుడుదిగుడుగా మారుతుంది. తెలుపు, నలుపు, ముదురు రంగు చారికలు నాలుక మీద ఏర్పడతాయి.


నొప్పి: ఆహారపదార్థాలు నమిలేటప్పుడు దవడ కండరాల్లో నొప్పి మొదలవుతుంది. వైరస్‌ కండరాల ఫైబర్లను, లైనింగ్స్‌ను దెబ్బతీయడమే ఇందుకు కారణం.

Updated Date - 2021-03-16T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising