ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రేస్‌లు అమర్చుకుంటే..!

ABN, First Publish Date - 2021-08-02T05:30:00+05:30

దంతాల అమరిక సరిగ్గా ఉంటే ముఖారవిందం రెట్టింపవుతుంది. టీనేజ్‌ పిల్లల్లో దంతాల అమరికను సరి చేయడం కోసం దంతవైద్యులు బ్రేస్‌లు అమరుస్తుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దంతాల అమరిక సరిగ్గా ఉంటే ముఖారవిందం రెట్టింపవుతుంది. టీనేజ్‌ పిల్లల్లో దంతాల అమరికను సరి చేయడం కోసం దంతవైద్యులు బ్రేస్‌లు అమరుస్తుంటారు. వీటిని అమర్చిన తరువాత చాలా మందిలో ఇరిటేషన్‌, అసౌకర్యంగా అనిపించడం జరుగుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అవేమిటంటే...


బ్రేస్‌లు అమర్చుకున్న వారు కొన్ని రకాల ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. క్యాండీ, పాప్‌కార్న్‌లాంటివి తింటే బ్రేస్‌ల మధ్యన ఇరుక్కుని శుభ్రం చేసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి మెత్తటి ఆహారం తీసుకోవడం మేలు. 

బ్రేస్‌లు అమర్చిన తరువాత నోటి శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. భోజనం, టిఫిన్‌, స్నాక్స్‌... ఏది తిన్నా బ్రష్‌ చేయడం తప్పనిసరి. బ్రాకెట్స్‌, వైర్స్‌ మధ్య ఆహారపదార్థాలు ఇరుక్కుపోకుండా ఉండాలంటే బ్రష్‌ చేయాలి.

దంతవైద్యున్ని క్రమంతప్పకుండా కలవాలి. వైర్‌ మూలంగా నొప్పి కలుగుతున్నా, బ్రేస్‌లు వదులైనా ఆ విషయాన్ని డాక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాలి. 

చిగుళ్లపై రాపిడి పడుతున్నా, ఇరిటేషన్‌ పుడుతున్నా సరిచేయించుకోవాలి. ప్రారంభంలో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అలాంటి సమయంలో బ్రేస్‌ల చుట్టూ డెంటల్‌ వాక్స్‌ లేదా నెయ్యి రాస్తే అసౌకర్యం తగ్గుతుంది. ఇబ్బంది ఎక్కువగా ఉంటే రోజులో నాలుగైదు సార్లు ఉప్పు నీటిని పుక్కిలించాలా. ఇలా చేయడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. 

Updated Date - 2021-08-02T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising