ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భోజనం తరువాత ఇలా చేస్తే..!

ABN, First Publish Date - 2021-06-09T05:30:00+05:30

కొంతమంది భోజనం చేయగానే కాఫీ లేదా టీ తాగుతారు. కానీ ఇలా చేయడం సరికాదంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే శరీరం ఐరన్‌ను గ్రహించడాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొంతమంది భోజనం చేయగానే కాఫీ లేదా టీ తాగుతారు. కానీ ఇలా చేయడం సరికాదంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే శరీరం ఐరన్‌ను గ్రహించడాన్ని టీ నిలువరిస్తుంది. అందుకే భోజనం చేసిన తరువాత ఒక గంట వరకు టీ తీసుకోకూడదు.


  • పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ భోజనం తరువాత మాత్రం కాదు. భోజనం తరువాత పండ్లు తింటే జీర్ణసమస్యలు వస్తాయి. శరీరం గ్రహించే పోషకవిలువల్లోనూ తేడా వస్తుంది.
  • భోజనం చేసిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ వర్కవుట్స్‌ చేయకూడదు. ఒకవేళ చేస్తే పొట్ట అసౌకర్యానికి గురవుతుంది.
  • భోజనం తరువాత స్నానం చేస్తే ఆహారం జీర్ణం కావడం ఆలస్యమవుతుంది. షవర్‌ చేస్తే రక్తం ఆహారం జీర్ణంకావడానికి సహాయం చేయడానికి బదులుగా, శరీరంలో ఇతర భాగాలకు సరఫరా అవుతుంది. 
  • భోజనం తరువాత నిద్ర కూడా మంచిది కాదంటున్నారు నిపుణులు. భోజనం చేయగానే నిద్రకు ఉపక్రమిస్తే జీర్ణరసాలు అధికమొత్తంలో ఉత్పత్తి అయి గుండెలో మంట వంటి సమస్యలు వస్తాయి. మొత్తం జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది.

Updated Date - 2021-06-09T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising