ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోషల్‌ మీడియాలోకి అనుమతిస్తుంటే..!

ABN, First Publish Date - 2021-09-13T05:48:52+05:30

ఇప్పుడు స్మార్ట్‌యుగం నడుస్తోంది. పిల్లల చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు సాధారణ విషయమై పోయింది. మరి పిల్లలు సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండొచ్చా? సోషల్‌మీడియాలోకి పిల్లలను ఎప్పుడు అనుమతించవచ్చు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇప్పుడు స్మార్ట్‌యుగం నడుస్తోంది. పిల్లల చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు సాధారణ విషయమై పోయింది. మరి పిల్లలు సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండొచ్చా? సోషల్‌మీడియాలోకి పిల్లలను ఎప్పుడు అనుమతించవచ్చు? ఆ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి సందేహాలు చాలామంది తల్లిదండ్రుల్లో ఉంటున్నాయి. అయితే తల్లిదండ్రులు ఏం చేయాలంటే...


ఇంటర్నెట్‌ను సరియైున పద్ధతుల్లో ఉపయోగించకుంటే పిల్లలు చాలా ఇబ్బందుల్లో పడతారు. అంతేకాదు పిల్లల ఆరోగ్యానికి హానికరం కూడా. అందుకే పిల్లలను సోషల్‌మీడియాలోకి అనుమతించే ముందు చాలా అంశాలు పరిగణలోకి తీసుకోవాలి.

చాలా యాప్స్‌, వెబ్‌సైట్స్‌ 13 సంవత్సరాల పైబడిన పిల్లలకు మాత్రమే యాక్సె్‌సని ఇస్తాయి. అయితే పిల్లలు వయసు తప్పుగా ఎంటర్‌ చేసి యాప్స్‌ ఇన్‌స్టాల్‌ చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో పిల్లలపై ఒక కన్నేసి ఉంచాలి. వయసు తప్పుగా ఎంటర్‌ చేసి యాప్స్‌ ఉపయోగించడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను ఉదాహరణలతో వివరించాలి.

పిల్లల మానసిక పరిపక్వతను పరిగణలోకి తీసుకోవాలి. పిల్లలు నిబంధనలు పాటిస్తారు, హానె్‌స్టగా ఉంటారు అనిపిస్తే సోషల్‌ మీడియాలో అనుమతించాలి.

సోషల్‌ మీడియాలోకి అనుమతిస్తే తప్పక టైం లిమిట్‌ పెట్టాలి. ఒక నిర్దిష్టమైన సమయంలోనే చూసేందుకు అనుమతినివ్వాలి. అదే పనిగా ఫోన్‌ చూస్తే కళ్లు దెబ్బతింటాయనే విషయాన్ని చెప్పాలి.

పేరెంటల్‌ కంట్రోల్స్‌ ఉండేలా చూసుకోవాలి. ప్రతి వారం పిల్లలు చూసిన వెబ్‌సైట్లు, యాప్స్‌, నెట్‌లో గడిపిన సమయాన్ని తప్పక చెక్‌ చేయాలి.

Updated Date - 2021-09-13T05:48:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising