ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోపం వస్తోందా?

ABN, First Publish Date - 2021-05-06T05:30:00+05:30

కొవిడ్‌ మరణాలు, వాటిని ఆపలేని నిస్సహాయత, ఎవరిని కలవాలన్నా భయం, ఎప్పుడు కొవిడ్‌ సోకుతుందో అనే ఆందోళన... నెలల తరబడి కొనసాగే ఇలాంటి పరిస్థితి మానసిక భావోద్వేగాలకు లోను చేయడం సహజం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్‌ మరణాలు, వాటిని ఆపలేని నిస్సహాయత, ఎవరిని కలవాలన్నా భయం, ఎప్పుడు కొవిడ్‌ సోకుతుందో అనే ఆందోళన... నెలల తరబడి కొనసాగే ఇలాంటి పరిస్థితి మానసిక భావోద్వేగాలకు లోను చేయడం సహజం. కొన్నిసార్లు అకారణంగా చెప్పలేనంత కోపానికి కూడా గురవుతాం! ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే....


  1. శ్వాస: దీర్ఘ శ్వాస కండరాలు, నాడులు నెమ్మదించేలా చేస్తుంది. కోపం వచ్చినప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలడం అలవాటు చేసుకోవాలి. అలాగే కొద్దిసేపు నడవాలి. నడకతో కండరాలు రిలాక్స్‌ అవడంతో పాటు, ఆ సందర్భం కోపం తెచ్చుకోవడానికి తగినదేనా? అని మనల్ని మనం తరచి చూసుకునే సమయమూ చిక్కుతుంది. 
  2. మాటల మంత్రం: ఆవేశంలో ఆలోచనలను పరుగులు తీస్తున్నప్పుడు, పరిష్కారం కనిపించదు. దాంతో కోపానికి లోనవుతాం. ఆ సమయంలో మాటలతో లౌక్యంగా కోపాన్ని అదుపు చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం ‘ఇప్పుడేమైందని కోపం తెచ్చుకోవాలి? అంతా సర్దుకుంటుంది’ అనో, ‘కోపం తెచ్చుకోవడం వల్ల ప్రయోజనం ఏముంది?’ అనో, ‘రిలాక్స్‌’, టేకిట్‌ ఈజీ... ఇలా మాటల మంత్రంతో కోపాన్ని చల్లార్చాలి.
  3. సంగీతం: శ్రావ్యమైన సంగీతం, మనసును ఉల్లాసపరిచే సాహిత్యం కచ్చితంగా స్వాంతనను అందిస్తాయి. కాబట్టి కోపం చల్లారాలంటే సంగీతం వినాలి.
  4. స్ట్రెచింగ్‌: కోపంలో కండరాలు బిగదీసుకుంటాయి. కాబట్టి స్ట్రెచింగ్‌తో పాటు, కీళ్లు రిలాక్స్‌ అయ్యే ఎక్సర్‌సైజ్‌లు చేయాలి.
  5. మాట్లాడాలి: కోపాన్ని వ్యక్తం చేయడం మంచిదే! దాని వల్ల మనసులోని ఒత్తిడి తొలగిపోతుంది. అయితే కోపాన్ని అరుపులు, కేకలతో కాకుండా తెలివిగా, అర్థవంతమైన చర్చ రూపంలో వెళ్లగక్కాలి. ఇందుకోసం కోపానికి కారణమైన అంశం గురించి స్నేహితులతో ఉపయోగకరమైన చర్చ కొనసాగించవచ్చు. 

Updated Date - 2021-05-06T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising