ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాంటీబాడీలు ఎంతకాలం?

ABN, First Publish Date - 2021-03-30T05:47:49+05:30

కొవిడ్‌ నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరిలో యాంటీబాడీలు తయారవుతాయనే విషయం అందరికీ తెలిసిందే! అయితే ఇవి ఎంతకాలం, ఎంతమేరకు ఆరోగ్య రక్షణ కల్పిస్తాయనే విషయంలో అయోమయం నెలకొని ఉంది. ఈ దిశగా చేపట్టిన ఓ అధ్యయనంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్‌ నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరిలో యాంటీబాడీలు తయారవుతాయనే విషయం అందరికీ తెలిసిందే! అయితే ఇవి ఎంతకాలం, ఎంతమేరకు ఆరోగ్య రక్షణ కల్పిస్తాయనే విషయంలో అయోమయం నెలకొని ఉంది. ఈ దిశగా చేపట్టిన ఓ అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకొచ్చాయి. అవేమిటంటే...


కొవిడ్‌ నుంచి కోలుకున్న కొందరిలో యాంటీబాడీలు శరవేగంతో అంతరిస్తే, మరికొందర్లో ఏకంగా ఆరు నెలల పాటు రక్షణ కల్పిస్తున్నాయి. ఇంకొందరిలో వాటి పరిమాణం పెరుగుతూ, తరుగుతూ కొనసాగడమూ జరుగుతోంది. ఇలా వీటి పరిమాణంలో హెచ్చుతగ్గులకు కారణాలను శోధించినప్పుడు, యాంటీబాడీల తీవ్రత, సామర్థ్యాలు ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత, ప్రొ ఇన్‌ఫ్లమేటరీ సైటోకైన్స్‌, కీమోకైన్స్‌, గ్రోత్‌ ఫ్యాక్టర్ల మీద ఆధారపడి ఉంటుందని తేలింది. సైటోకైన్‌ స్టార్మ్‌తో తీవ్రమైన కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురైన వారిలో యాంటీబాడీలు ఆరు నెలల పాటు భేషుగ్గా ఉంటాయి. అలాకాకుండా తేలికపాటి ఇన్‌ఫెక్షన్‌కు గురైనవాళ్లు లేదా ఎటువంటి లక్షణాలు బయల్పడనివాళ్లలో యాంటీబాడీలు అతి తక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి.


అయితే యాంటీబాడీలు సరిపడా ఉన్నా, లేకున్నా కొవిడ్‌ బారిన పడి, కోలుకున్న ప్రతి ఒక్కరిలో దీర్ఘకాలం పాటు కొనసాగే టి సెల్‌ ఇమ్యూనిటీ ఉండిపోతుంది. అయినప్పటికీ కొత్త కొవిడ్‌ స్ట్రెయిన్‌ దాడి నుంచి ఇవి రక్షణ కల్పించలేవు. దాంతో రీఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. వ్యాక్సిన్‌ ద్వారా హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించగలిగితే వ్యాక్సిన్‌ వేసుకోని వాళ్లకూ కొవిడ్‌ నుంచి రక్షణ దక్కుతుందని ఇప్పటివరకూ భావిస్తున్నాం. అయితే కాలక్రమేణా యాంటీబాడీల పరిమాణం తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రీ ఇన్‌ఫెక్షన్‌ తిరిగి విజృంభించే ప్రమాదం ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవడం ఒక్కటే మార్గం అంటున్నారు వైద్యులు.

Updated Date - 2021-03-30T05:47:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising