ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెయ్యితో చర్మం నిగనిగ...

ABN, First Publish Date - 2021-12-23T07:30:54+05:30

చాలా మంది నెయ్యిని ఆహారంలో మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. కానీ నెయ్యిని చర్మ సౌందర్య రక్షణకు ఉపయోగించటం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాలా మంది నెయ్యిని ఆహారంలో మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. కానీ  నెయ్యిని చర్మ సౌందర్య రక్షణకు ఉపయోగించటం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఆ ప్రయోజనలేంటో చూద్దాం..


  • నెయ్యి మన చర్మ పొరలలోకి చొచ్చుకుపోతుంది. దీని వల్ల చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. 
  • నెయ్యిలో ఏ, డీ, ఈ, కే విటమిన్లు ఉంటాయి. వీటి వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన పోషకాలన్నీ లభిస్తాయి. 
  • నెయ్యిని క్రమం తప్పకుండా రాయటం వల్ల చర్మంపై ఉండే మచ్చలన్నీ తొలగిపోతాయి.  
  • పెదవులు ఎండిపోయి.. వాటిపైనున్న చర్మం పొట్టుగ్గా రాలిపోతున్నప్పుడు నెయ్యి రాయటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. రాత్రి నిద్రపోయే ముందు పెదవులకు నెయ్యి రాస్తే- ఉదయానికి మెత్తగా తయారవుతాయి. 
  • ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది వాటర్‌ఫ్రూప్‌ మేక్‌పను వేసుకుంటున్నారు. సాధారణంగా ఈ మేక్‌పను తొలగించటం చాలా కష్టమైన పని. నెయ్యి ద్వారా ఈ మేకప్‌ను సులభంగా తొలగించవచ్చు. 
  • వంటింట్లో ఎక్కువగా పనిచేస్తే చేతివేళ్లు గరుగ్గా తయారవుతాయి. అలాంటి వేళ్లకు నెయ్యి రాయటం వల్ల అవి మృదువుగా మారతాయి. 

Updated Date - 2021-12-23T07:30:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising