ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కురులకు హెర్బల్‌ ఆయిల్‌!

ABN, First Publish Date - 2021-04-19T05:30:00+05:30

జుట్టు నిండుగా, పట్టులా ఉండేందుకు చాల రకాల నూనెలు ప్రయత్నిస్తున్నారా! ఇంటివద్దనే కొబ్బరి నూనెతో హెర్బల్‌ ఆయిల్‌ తయారుచేసుకోవచ్చు. దీని తయారీ ఎలాగంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జుట్టు నిండుగా, పట్టులా ఉండేందుకు చాల రకాల నూనెలు ప్రయత్నిస్తున్నారా! ఇంటివద్దనే కొబ్బరి నూనెతో హెర్బల్‌ ఆయిల్‌ తయారుచేసుకోవచ్చు. దీని తయారీ ఎలాగంటే...


కావాల్సినవి: మందార పూలు-20, వేప ఆకులు- 30, కరివేపాకు- 30, ఉల్లిపాయ చిన్నది, మెంతులు- ఒక టీస్పూన్‌, కలబంద కొమ్మ ఒకటి,  జాస్మిన్‌ పూలు - 15 -20, కొబ్బరి నూనె ఒక లీటరు. 


తయారీ:

  1. మెంతులను అరగంట పాటు నీటిలో నానబెట్టాలి. కలబందను చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. తరువాత అన్నింటిని మిక్సీలో వేసి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని లీటరు కొబ్బరి నూనెలో కలపాలి. 
  2. తరువాత కొబ్బరి నూనెను చిన్న మంట మీద 45 నిమిషాలు మరిగిస్తే ఆకుపచ్చగా మారుతుంది. కొబ్బరి నూనెను చల్లారిన తరువాత గాజుసీసాలో వడబోసి, భద్రపరచాలి. 


లాభాలివి

ఈ హెర్బల్‌ నూనెను జుట్టుకు పట్టించి మసాజ్‌ చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఇలాచేస్తే పట్టులాంటి నిండైన కురులు మీ సొంతమవుతాయి. ఈ నూనెలోని మందార, కరివేపాకు, ఉల్లిపాయ కురులను దృఢంగా, పొడవుగా పెరిగేలా చేస్తాయి. వేప ఆకులు చుండ్రును నివారిస్తుంది. కలబంద వెంట్రుకలు చక్కగా పెరిగేలా చేసి మెరుపుదనాన్ని ఇస్తుంది. మెంతులు కురులను ఆరోగ్యంగా మార్చుతాయి.

Updated Date - 2021-04-19T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising