ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోలాతో ఆరోగ్యం పరార్‌!

ABN, First Publish Date - 2021-10-14T05:30:00+05:30

ఫాస్ట్‌ ఫుడ్‌, ఫాస్ట్‌ డ్రింక్‌లది విడదీయలేనంత అనుబంధం. పిజ్జా, బర్గర్‌, పఫ్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫాస్ట్‌ ఫుడ్‌, ఫాస్ట్‌ డ్రింక్‌లది విడదీయలేనంత అనుబంధం. పిజ్జా, బర్గర్‌, పఫ్‌... ఏది తిన్నా నీళ్లకు బదులుగా అందరూ ఎంచుకునే పానీయం శీతల పానీయమే! అయితే దీంతో లెక్కలేనన్ని ఆరోగ్య నష్టాలున్నాయి. వాటి మీద ఓ కన్నేద్దాం!


మెటబాలిక్‌ సిండ్రోమ్‌: రోజుకో కూల్‌ డ్రింక్‌ తాగితే చాలు. మధుమేహం బారిన పడే  అవకాశాలను 67% వరకూ కొని తెచ్చుకున్నట్టే!


చర్మం మీద దద్దుర్లు: సోడాల్లో ఉండే బ్రోమినేటెడ్‌ వెజిటబుల్‌ ఆయిల్‌ అనే రసాయనానికీ నాడీ నష్టానికీ సంబంధం ఉంది. ఈ రసాయనంతో చర్మం మీద దద్దుర్లు కూడా తలెత్తుతాయి.


చర్మపు ముడతలు: కూల్‌ డ్రింక్స్‌ నిల్వ కోసం వాడే ఫాస్ఫేట్స్‌, ఫాస్ఫారిక్‌ యాసిడ్లు చర్మపు సాగే గుణాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా తక్కువ వయసులోనే వయసు పైబడిన వారిలా కనిపిస్తాం.


రక్తంలో కొవ్వులు: రోజుకో కూల్‌ డ్రింక్‌ తాగడం వల్ల రక్తంలో ట్రైగ్లిసరైడ్లు 30% పెరగుతాయి. ఇవి గుండె రక్తనాళాలను గట్టిపరుస్తాయి.


మెదడు డ్యామేజీ: కూల్‌డ్రింకులకు ఆకర్షణీయమైన రంగులు తెచ్చిపెట్టే కృత్రిమ రంగులు, కృత్రిమ స్వీటెనర్లు (ఆస్పర్టేమ్‌) మెదడు కణాలను నాశనం చేస్తాయి. దాంతో జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఆలోచనల్లో స్పష్టత లోపిస్తుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం క్రమేపీ తగ్గుతుంది.


దంతక్షయం: ఫాస్ఫారిక్‌, సిట్రిక్‌ యాసిడ్లు నోట్లోని పిహెచ్‌ బ్యాలెన్స్‌ను మారుస్తాయి. దాంతో దంత ఎనామిల్‌ కొట్టుకుపోయి దంతక్షయం పెరుగుతుంది.

Updated Date - 2021-10-14T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising