ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీ బలం.. మీ ఆహారంలోనే!

ABN, First Publish Date - 2021-06-23T09:07:34+05:30

కొవిడ్‌తో బాధపడిన తర్వాత నెగటివ్‌ వచ్చింది కదా అని ఊరికే ఉండకుండా మంచి పోషకాలున్న ఆహారం తినడం అలవాటు చేసుకోవాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్‌తో బాధపడిన తర్వాత నెగటివ్‌ వచ్చింది కదా అని ఊరికే ఉండకుండా మంచి పోషకాలున్న ఆహారం తినడం అలవాటు చేసుకోవాలి. కీళ్లనొప్పులు,శ్వాసతో ఇబ్బంది, పొడి దగ్గు, ఒత్తిడి, డిప్రషన్‌, జుట్టు రాలిపోవటం లాంటి సమస్యలు ఎదుర్కొన్న కొవిడ్‌ బాధితులు ఈ ఆహారం తీసుకోవటం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.


 తోటకూర బలవర్ధకమైన ఆహారం. కరోనాతో బాధపడిన వారికి వ్యాధినిరోధక శక్తి తగ్గడంతో పాటు వొంట్లోని నైట్రోజన్‌ తగ్గిపోతుంది. ఇలాంటి వారు తోటకూరను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల సెలనియం, మెగ్నీషియం, ఐరన్‌తో పాటు ప్రొటీన్లు అందుతాయి. అందుకే గడ్డే కదా అని తోటకూరను తక్కువ అంచనా వేయకండి. పప్పులో వేసుకోవడం, తోటకూర ఫ్రై లాంటివి తినటం మంచిది.


 శనగలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. అది కూడా మొలకెత్తిన శనగలు తీసుకోవాలి. ఇవి రోజు వారి డైట్‌లో ఉంటే అమినో యాసిడ్లు శరీరానికి బాగా అందుతాయి. తద్వారా డైజేషన్‌ సమస్య ఉండదు. వీటిలో బి, సి విటమిన్లు ఉంటాయి కాబట్టి శరీరానికి శక్తి లభిస్తుంది. ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గిస్తుంది.


కొవిడ్‌ వచ్చిపోయాక రక్తంలో చక్కెరశాతం ఎక్కువ ఉంటుంది. దీన్ని తగ్గించాలంటే మాత్రం అల్లం తీసుకోవాల్సిందే. సాధారణంగానే మనం మాంసాహారం తినేప్పుడు అల్లంపేస్టును వాడుతుంటాం. మనదేశంలో అల్లంను జలుబు, దగ్గును తగ్గించుకోవడానికి కూడా వాడుతుంటారు. అల్లం టీ ఇందులో భాగమే. అల్లం రసం వల్ల గొంతులోని ఇన్‌ఫెక్షన్‌ పోతుంది. అల్లం మన శరీరంలోకి వెళ్తే రక్తకణాల్లోకి ఆక్సిజన్‌ అందుతుంది. రక్త ప్రసరణ మెరుగవుతుంది. కేవలం వైర్‌సనే కాదు బ్యాక్టీరియాను అంతమొందించే అద్భుతమైన ఆహారం అల్లం.


 ఆల్మండ్స్‌ తినటం వల్ల రక్తంలో చక్కెరశాతం అదుపులో ఉంటుంది. రోజూ 20 ఆల్మండ్స్‌ తింటే 37 శాతం ఇ-విటమిన్‌, 20 శాతం మాంగనీసు లభిస్తుంది. విటమిన్‌-ఇ అందటం వల్ల డ్యామేజ్‌ అయిన కణాలకు మంచిది. మాంగనీసు వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. నిద్రలేమితో బాధపడే వారు దాన్నించి బయటపడటమే కాదు ఒత్తిడి, డిప్రెషన్‌ను తగ్గించే గుణం మాంగనీసుకుంది. అందుకే ఆల్మండ్‌ మీ జీవితంలో భాగం చేసుకుంటే మరింత చురుగ్గా ఉండొచ్చు. 


దానిమ్మ గింజలు తింటే శరీరంలో రక్తం వృద్ధి అవుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. ఇవి బలమైన యాంటీ ఇనఫ్లమేషన్‌ కాంపౌండ్స్‌ ఇస్తాయి. మోకాళ్ల నొప్పులు త్వరగా తగ్గిపోతాయి. దానిమ్మ జ్యూస్‌ చేసి పెద్దవాళ్లతో తాగించడం మంచిది. 

Updated Date - 2021-06-23T09:07:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising