ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇవి పాటిస్తున్నారా!

ABN, First Publish Date - 2021-03-20T05:30:00+05:30

వర్కవుట్‌ చేస్తే శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేనా చర్మం కూడా అందంగా, నాజూకుగా తయారవుతుంది. అయితే వర్కవుట్‌కు ముందూ, మధ్యలో, తరువాతా చర్మసంరక్షణ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్కవుట్‌ చేస్తే శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేనా చర్మం కూడా అందంగా, నాజూకుగా తయారవుతుంది. అయితే వర్కవుట్‌కు ముందూ, మధ్యలో, తరువాతా చర్మసంరక్షణ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేమిటో చూద్దాం...


వర్కవుట్‌కు ముందు 

  • మేకప్‌తో, చర్మం మురికిగా ఉన్నప్పుడు అలానే వ్యాయామాలు చేస్తే పగుళ్లు ఏర్పడతాయి. అందుకే మొదటగా ఆయిల్‌ ఉన్న క్లీన్సర్‌తో, తరువాత తేలికైన క్లీన్సర్‌తో మేకప్‌ తొలగించాలి. 
  • మాయిశ్చరైజర్‌, లిప్‌బామ్‌ రాసుకుంటే పెదవులు పొడిగా మారవు.


వర్కవుట్‌ మధ్యలో

  • వ్యాయామం చేసే సమయంలో చేతులతో ముఖాన్ని తాకవద్దు. ఎందుకంటే జిమ్‌లోని పరికరాల మీద ఉండే క్రిములు, బ్యాక్టీరియా ముఖం మీద చేరి మచ్చలు, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతాయి. వ్యాయామం చేస్తున్నప్పుడు చేతులను ముఖానికి దూరంగా ఉంచాలి. 
  • ముఖం మీద చెమట పట్టగానే దుస్తులకు ముఖాన్ని రాయకూడదు. అలాచేస్తే ముఖం మీద దద్దుర్లు, దురద వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే మెత్తని టవల్‌తో ముఖం మీద అద్దినట్టు చెమటను తుడుచుకోవాలి. 
  • వర్కవుట్‌ సమయంలో మధ్యమధ్యలో నీళ్లు తాగుతుండాలి. లేదంటే డీహైడ్రేషన్‌, గొంతు తడారడం, చెమట పట్టకపోవడం వంటి పరిస్థితులు తలెత్తుతాయి. 


వర్కవుట్‌ తరువాత 

  • వ్యాయామాలు పూర్తయిన తరువాత ముఖాన్ని మీ చర్మానికి సరిపడే తేలికైన క్లీన్సర్‌తో శుభ్రం చేసుకోవాలి. దాంతో చెమట తొలగిపోయి చర్మరంధ్రాలు మూతపడవు. 
  • చెమట పట్టడం మూలంగా ఒంట్లోని మలినాలు దుస్తులకు అంటుకుంటాయి. అందుచేత వర్కవుట్‌ అవగానే స్నాం చేసి శుభ్రమైన దుస్తులు వేసుకోవాలి.
  • ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నప్పుడు ఒంట్లో పుట్టే వేడి వల్ల చర్మం ఎర్రగా కనిపిస్తుంది. క్లీన్సర్‌తో చర్మాన్ని శుభ్రం చేసుకున్న తరువాత మాయిశ్చరైజర్‌ రాసకుంటే చర్మం సాంత్వన పొందుతుంది.

Updated Date - 2021-03-20T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising