ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కజొన్నలో కంకుల్ని ఉడికించి తినడం మంచిదా, కాల్చి తింటే మంచిదా?

ABN, First Publish Date - 2021-07-25T21:10:44+05:30

వందగ్రాముల ఉడికించిన మొక్కజొన్న గింజల్లో దాదాపు వంద కెలోరీలు ఉంటాయి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వందగ్రాముల ఉడికించిన మొక్కజొన్న గింజల్లో దాదాపు వంద కెలోరీలు ఉంటాయి. అన్ని రకాల ముడిధాన్యాల్లానే మొక్కజొన్నలో కూడా పిండిపదార్థాలు అధికం. ఈ పిండిపదార్థాల్లో భాగంగా కొంత చక్కెర, పీచుపదార్థాలు ఉంటాయి. మొక్కజొన్న పేలాల్లో (పాప్‌కార్న్‌) కూడా పీచుపదార్థం ఉంటుంది. బి3, బి5, బి6, బి9 మొదలైన విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్‌, జింక్‌ లాంటి ఖనిజాలు మొక్కజొన్న గింజలో, పేలాల్లోనూ లభిస్తాయి. అధికస్థాయిలో పిండిపదార్థాలు ఉండడం వల్ల మధుమేహం ఉన్నవారు వివిధ రకాల ధాన్యాలతో పాటు మొక్కజొన్నను కూడా పరిమిత మోతాదులోనే తీసుకోవాలి. మొక్కజొన్నలో ఉండే ల్యూటిన్‌, జియాగ్జాథిన్‌ అనే యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మొక్కజొన్న కంకులను తక్కువ నీటిలో ఆవిరిపై ఉడికిస్తే వాటిలోని పోషకాలకు ఎక్కువ నష్టం కలగకుండా చూసుకోవచ్చు. ఒక వేళ బొగ్గులపై లేదా మంటలో నేరుగా కాల్చినట్టయితే ఎక్కువ కాలినా లేదంటే కొద్దిగా మాడినా ఆ గింజలను తీసేసి మిగిలినవి తినడం మంచిది. మాడిన గింజల్లో క్యాన్సర్‌ కారక పదార్థాలు ఉండే అవకాశం ఎక్కువ

- రజనీ, సూర్యాపేట


Updated Date - 2021-07-25T21:10:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising