ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫేస్‌ అయిల్‌ వాడుతున్నారా!

ABN, First Publish Date - 2021-02-13T05:33:15+05:30

చర్మాన్ని కోలుకునేలా చేయడంతో పాటు చర్మానికి రక్షణ పొరలా పనిచేస్తాయి ఫేస్‌ ఆయిల్స్‌. చర్మానికి కాంతిని,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చర్మాన్ని కోలుకునేలా చేయడంతో పాటు చర్మానికి రక్షణ పొరలా పనిచేస్తాయి ఫేస్‌ ఆయిల్స్‌. చర్మానికి కాంతిని, తాజాదనాన్ని ఇచ్చే సౌందర్య ఉత్పత్తుల్లో ఫేస్‌ అయిల్‌ ఒకటి. ఏ రకం చర్మం వారికి ఎటువంటి ఫేస్‌ ఆయిల్‌ సరిపోతుందో చూద్దాం...


చర్మంలోని నూనె గ్రంథులు నూనెను ఎక్కువగా ఉత్పత్తి చేయడం వల్ల చర్మం జిడ్డుగా అనిపిస్తుంది. ట్రీ, లేదా వేప నూనె అధికంగా నూనె ఉత్పత్తిని నియంత్రిస్తాయి. బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ను సమూలంగా తొలగిస్తాయి.


పొడిచర్మం ఉన్నవారికి అన్ని రకాల ఫేస్‌ ఆయిల్స్‌ నప్పుతాయి. పెద్ద అణువులున్న ఫేస్‌ ఆయిల్స్‌ చర్మం మంట పుట్టకుండా చూస్తాయి. ద్రాక్ష, దానిమ్మ లేదా అవకాడో ఫేస్‌ ఆయిల్స్‌లో ఏది ఎంచుకున్నా సరే. 


సాధారణ చర్మం గలవారిలో చర్మం పొడిబారడం చాలా తక్కువ. వీరిలో ఫేస్‌ ఆయిల్స్‌ చర్మానికి తేమను అందించి, చర్మం స్వభావాన్ని సంరక్షిస్తాయి. అలాకాకుండా బాదం నూనె వంటివి ఉపయోగిస్తే చర్మం మంట పుట్టడం, పొడిబారడం వంటి సమస్యలు మొదలవుతాయి.


ముడతలు, వయసు తాలుకు మచ్చలు ఉన్నవారు యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉండే ఫేస్‌ ఆయిల్‌ ఎంచుకోవాలి. ముఖ్యంగా అవకాడో, గ్రేప్‌ సీడ్‌ ఆయిల్‌ వాడితే చర్మం మృదువుగా మారి, యవ్వనంగా కనిపిస్తుంది.


Updated Date - 2021-02-13T05:33:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising