ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాప్‌తో జంక్‌ ఫుడ్‌కు దూరం!

ABN, First Publish Date - 2021-06-05T05:12:21+05:30

బ్రెయిన్‌ ట్రైనింగ్‌ యాప్‌ ఉపయోగించేవారిలో జంక్‌ ఫుడ్‌ వినియోగంతో పాటు బరువు కూడా తగ్గినట్టు ఓ అధ్యయనంలో తేలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రెయిన్‌ ట్రైనింగ్‌ యాప్‌ ఉపయోగించేవారిలో జంక్‌ ఫుడ్‌ వినియోగంతో పాటు బరువు కూడా తగ్గినట్టు ఓ అధ్యయనంలో తేలింది. లండన్‌లోని ‘యూనివర్సిటీ ఆఫ్‌ ఎక్సెటర్‌’ జరిపిన ఈ అధ్యయనంలో మొత్తం 1,234 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. వీరందరి మొబైల్‌లో ‘ద ఫుడ్‌ ట్రైనర్‌’ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేశారు. ఇది ఓపెన్‌ చేస్తే ఆరోగ్యకరమైనవి అలాగే అనారోగ్యకరమైన ఆహార పదార్థాల బొమ్మలు రోల్‌ అవుతుంటాయి. ఆరోగ్యకర ఆహారం వచ్చినప్పుడు దానిపై ట్యాప్‌ చేయాలి. అనారోగ్యకర ఆహారమైతే వదిలేయాలి. ‘‘యాప్‌ ఆధారిత ఈ ‘గో/నో-గో ట్రైనింగ్‌’ వల్ల యూజర్‌కు రోజూ వాళ్లు తినే ఆహారంపై ఒక అవగాహన కలుగుతుంది. నెలపాటు రోజుకు ఒకసారి ఈ గేమ్‌ ఆడితే ‘ఎయిట్‌-పాయింట్‌ స్కేల్‌’లో ఒక పాయింట్‌ జంక్‌ ఫుడ్‌ వినియోగం తగ్గినట్టు గుర్తించాం’’ అని సదరు విశ్వవిద్యాలయం ప్రకటించింది. 


ఒకటి కంటే ఎక్కువసార్లు ఈ గేమ్‌ ఆడేవారిలో ఇది చెప్పుకోతగ్గ స్థాయిలో ప్రభావం చూపినట్టు పరిశోధనలో వెల్లడైంది. రోజుకు నాలుగు లేదా అంత కంటే ఎక్కువ నుంచి నెలకు ఒకటి లేదా అంతకన్నా తక్కువ జంక్‌ఫుడ్స్‌ వినియోగాన్ని ఈ ‘ఎయిట్‌-పాయింట్‌ స్కేల్‌’ సూచిస్తుంది. 


కాగా ఈ అధ్యయనంలో పాల్గొన్న వాలంటీర్లు కనీసం పదిసార్లు గేమ్‌ ఆడారు. ‘‘వీరందరూ సగటున అరకిలో బరువు తగ్గారు. అలాగే వారానికి రెండు నుంచి నాలుగుసార్లు జంక్‌ఫుడ్‌ తీసుకొనేవారు... నెల రోజులపాటు ఈ యాప్‌ ఉపయోగించిన తరువాత ఒకసారి మాత్రమే తింటున్నారు’’ అని వర్సిటీ ప్రొఫెసర్‌ నటాలియా లారెన్స్‌ వెల్లడించారు. ప్రత్యేకించి ఈ లాక్‌డౌన్లలో ఇంటి పట్టునే ఉండి, బరువు పెరిగిన వారికి ఇలాంటి గేమ్స్‌ ఉపయోగ పడతాయంటున్నారు.

Updated Date - 2021-06-05T05:12:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising