ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోంప్‌ షెర్బత్‌

ABN, First Publish Date - 2021-03-18T05:33:55+05:30

వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు మజ్జిగ, నిమ్మరసం తాగుతాం. ఒంటికి చల్లదనాన్ని అందించే సోంప్‌ షెర్బత్‌ మలినాలను కూడా తొలగిస్తుంది. ఈ స్పెషల్‌ షెర్బత్‌ తయారీని న్యూట్రిషనిస్ట్‌ మున్మున్‌ గనేరివాల్‌ వివరిస్తున్నారిలా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు మజ్జిగ, నిమ్మరసం తాగుతాం. ఒంటికి చల్లదనాన్ని అందించే సోంప్‌ షెర్బత్‌  మలినాలను కూడా తొలగిస్తుంది. ఈ స్పెషల్‌ షెర్బత్‌ తయారీని న్యూట్రిషనిస్ట్‌ మున్మున్‌ గనేరివాల్‌ వివరిస్తున్నారిలా...

కావలసినవి: సోంప్‌ గింజలు- పావు కప్పు, నల్లని ఎండుద్రాక్ష - టేబుల్‌స్పూన్‌, వైట్‌రాక్‌ షుగర్‌ - రెండు టేబుల్‌ స్పూన్లు, నీళ్లు - రెండు కప్పులు, (కావాలనుకుంటే నిమ్మరసం - టేబుల్‌స్పూన్‌). 

తయారీ విధానం: ముందుగా సోంప్‌ గింజలను మెత్తని పొడిలా చేసుకోవాలి. సోంప్‌ పొడిని రెండు లేదా మూడు గంటలు నీటిలో నానబెట్టాలి. నల్ల ఎండుద్రాక్షను విడిగా నీటిలో రెండు గంటలు నానబెట్టాలి. ఇప్పుడు వైట్‌రాక్‌ షుగర్‌ను మిక్సీలో పొడి చేసుకోవాలి. సోంప్‌ పొడి బాగా నానిన తరువాత నీటిని ఒక పాత్రలోకి వడబోయాలి. నానబెట్టిన నల్ల ఎండుద్రాక్షను మిక్సీ పట్టి, సోంప్‌ నీళ్లున్న పాత్రలో వేయాలి. ఇప్పుడు చక్కెర పొడి వేసి బాగా కలిపితే టేస్టీ సోంప్‌ షెర్బత్‌ రెడీ. చుక్క నిమ్మరసం కలిపి కూడా తాగొచ్చు.

Updated Date - 2021-03-18T05:33:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising