ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వింటర్ సీజన్‌లో ఈ టిప్స్ పాటించండి: సోహా అలీఖాన్

ABN, First Publish Date - 2021-11-27T23:54:25+05:30

బాలీవుడ్‌ తారల్లో సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా ఎప్పుడూ వార్తల్లో ఉంటూ అందర్నీ ఆకట్టుకునే కొందరిలో సైఫ్‌ అలీఖాన్ సోదరి సోహా అలీఖాన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌ తారల్లో సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా ఎప్పుడూ వార్తల్లో ఉంటూ అందర్నీ ఆకట్టుకునే కొందరిలో సైఫ్‌ అలీఖాన్ సోదరి సోహా అలీఖాన్‌ ముందు వరుసలో ఉంటుంది. తాజాగా తన వర్కవుట్స్‌ వీడియోస్‌ ద్వారా అందరినీ ఆకట్టుకున్న సోహా... సంప్రదాయ వైద్య చిట్కాలనే తాను ఫాలో అవుతానని అంటోంది. తన ఆరోగ్య రహస్యం అదేనని చెబుతోంది. ప్రస్తుత వింటర్‌ సీజన్‌ను ఎదుర్కోవడానికి ఫ్యాన్స్‌ కోసం కొన్ని టిప్స్‌ కూడా ఇస్తోంది. ‘‘వర్షాకాలం ముగియడం, శీతాకాలం ఆరంభం కావడం వంటి వాతావరణ మార్పుల కారణంగా దగ్గు, జలుబు లాంటి సమస్యలు అధికంగా కనిపిస్తుంటాయి. మన ఆరోగ్యం కోసం అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. యోగా సాధన ఈ సీజన్‌లో చాలా మంచిది. వాతావరణంలో అకస్మాత్తుగా జరిగే మార్పులను తట్టుకుని నిలబడటానికి  శరీరానికి కొంత సమయం ఇవ్వడం అవసరం. చలికాలంలో అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు నేను మా పెద్ద వాళ్ల అడుగు జాడల్లో నడుస్తుంటాను. మా అమ్మ చిన్నప్పుడు మా కోసం చేసినట్టు.. విక్స్‌ వ్యాపోరబ్‌తో ఆవిరి పట్టడం, యూకలిప్టస్, కర్పూరం, పుదీనా వంటి వాటిని వంటింటి వైద్యంలో భాగంగా వినియోగించడం చేస్తాను. తగినంత వేడిగా ఉండే వంటకాలు, సీజన్‌కు తగ్గట్టుగా సరైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పని వ్యాయామం ద్వారా శ్వాస కోస వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. నా కుమార్తె ఇన్నాయాతో కలిసి సూర్యాస్తమయం చూడటాన్ని అమితంగా ఇష్టపడతాను.  అది కూడా నాకు చాలా రిలీఫ్‌ ఇస్తుంది.’’ అని సోహా అలీఖాన్ చెప్పుకొచ్చింది.

Updated Date - 2021-11-27T23:54:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising