ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ జాగ్రత్తలు కీలకం!

ABN, First Publish Date - 2021-04-27T05:30:00+05:30

కొవిడ్‌ నుంచి కోలుకున్నా, కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ ప్రభావానికి కుదేలైన ఊపిరితిత్తులు కోలుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఇందుకోసం ప్రాణాయామంతో పాటు ఊపిరితిత్తులను బలపరిచే కొన్ని వ్యాయామాలు చేయాలి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్‌ నుంచి కోలుకున్నా, కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ ప్రభావానికి కుదేలైన ఊపిరితిత్తులు కోలుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఇందుకోసం ప్రాణాయామంతో పాటు ఊపిరితిత్తులను బలపరిచే కొన్ని వ్యాయామాలు చేయాలి.


ప్రాణాయామం!

  1. బొటనవేలితో కుడి నాసికా రంధ్రాన్ని మూసి, ఎడమ నాసికా రంధ్రంలో గాలి పీల్చుతూ నాలుగు అంకెలు లెక్కపెట్టాలి.
  2. తర్వాత ఎడమ నాసికా రంథ్రాన్ని కూడా మూసి, 16 అంకెలు లెక్కపెట్టాలి.
  3. తర్వాత కుడి నాసికా రంధ్రాన్ని తెరచి, 8 అంకెలు లెక్కపెడుతూ పూర్తిగా ఊపిరి వదలాలి.
  4. ఎడమ నాసికా రంధ్రాన్ని మూసి ఉంచి, కుడి నాసిక ద్వారా నాలుగు అంకెలు లెక్కబెడుతూ ఊపిరి పీల్చాలి.
  5. రెండు నాసికా రంధ్రాలూ మూసి ఉంచి, 16 అంకెలు లెక్కపెట్టేవరకూ శ్వాసను నిలిపి ఉంచాలి.
  6. ఎడమ నాసిక రంధ్రాన్ని తెరచి, 8 అంకెలు లెక్కపెట్టేవరకూ శ్వాస వదలాలి.


స్పైరోమెట్రీ!

  1. పరికరాన్ని నోట్లో ఉంచుకుని, పెదవులతో బిగించి పట్టుకోవాలి.
  2. ఇండికేటర్‌ గోల్‌ మార్కర్‌ను తాకేవరకూ నెమ్మదిగా శ్వాస పీల్చుకోవాలి.
  3. గాలిని పీల్చుకోలేని పరిస్థితి తలెత్తినప్పుడు పరికరాన్ని నోట్లో నుంచి తొలగించి, కనీసం మూడు సెకండ్ల పాటు గాలిని బిగబట్టి ఉంచి శ్వాస వదలాలి.
  4. వైద్యుల సూచించినన్ని సార్లు స్పైరోమెట్రీని ఈ విధంగా ఉపయోగించాలి.
  5. లెవెల్స్‌ను నమోదు చేయడం వల్ల వైద్యులు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని అంచనా వేయగలుగుతారు. కాబట్టి ఆ వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ ఉండాలి.


బెలూన్‌ వ్యాయామం

రోజు మొత్తంలో వీలైనన్ని బెలూన్లను ఊదుతూ ఉండాలి. బెలూన్లు ఊదడం వల్ల, డయాఫ్రమ్‌, రిబ్‌కేజ్‌ల సంకోచవ్యాకోచాలకు తోడ్పడే కండరాల సామర్థ్యం పెరుగుతుంది. ఎక్కువ ఆక్సిజన్‌ పీల్చుకోవడం వల్ల శ్వాసపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే సమస్య తప్పుతుంది. అలసట, నిస్సత్తువలు కూడా తగ్గుతాయి.


Updated Date - 2021-04-27T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising