ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేసవిలోనూ హుషారుగా...

ABN, First Publish Date - 2021-04-25T05:30:00+05:30

గర్భం దాల్చిన మహిళల శరీరంలో వచ్చే మార్పులు వారికి కొంత ఇబ్బంది కలిగిస్తాయి. వేసవిలో ఎండలు గర్భిణులను మరింత అసౌకర్యానికి గురిచేస్తాయి. అయితే ‘ఆహారం నుంచి దుస్తుల వరకు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వేసవిలోనూ హుషారుగా ఉండొచ్చు’ అంటున్నారు గైనకాలజిస్ట్‌ ప్రతిమా రెడ్డి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గర్భం దాల్చిన మహిళల శరీరంలో వచ్చే మార్పులు వారికి కొంత ఇబ్బంది కలిగిస్తాయి. వేసవిలో ఎండలు గర్భిణులను మరింత అసౌకర్యానికి గురిచేస్తాయి. అయితే ‘ఆహారం నుంచి దుస్తుల వరకు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వేసవిలోనూ హుషారుగా ఉండొచ్చు’ అంటున్నారు గైనకాలజిస్ట్‌ ప్రతిమా రెడ్డి. ఆమె ఏం సూచిస్తున్నారంటే...


  1. హైడ్రేషన్‌: రోజుకు కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగాలి. కొబ్బరి నీళ్లు లేదా తాజా పండ్ల రసాలు తాగుతూ ఉండాలి. ఒంట్లో నీటి శాతం తగ్గకుండా చూసుకుంటే  ఎండ వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. 
  2. ఆహారం: ఆకుకూరలు, మొలకెత్తిన విత్తనాలతో చేసిన సలాడ్స్‌, పండ్లు (ముఖ్యంగా వాటర్‌మెలన్‌) ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పెరుగు, మజ్జిగ కూడా చల్లదనాన్ని ఇస్తాయి. ఎక్కువగా నూనె, నెయ్యి, మసాలా, ఉప్పు ఉన్న ఆహారాన్ని చాలా వరకు తగ్గించాలి. 
  3. వ్యాయామం: తేలికైన వ్యాయామాలు చేయాలి. ఎక్కువ సమయం నిల్చోవడం, కూర్చోవడం వల్ల కాళ్ల మీద ఒత్తిడి పడుతుంది. అప్పుడు కాళ్లను కొంచెం ఎత్తులో ఉంచాలి. 
  4. దుస్తులు, చెప్పులు: వదులుగా, తెలుపు రంగులో ఉన్న దుస్తులు ధరించాలి. గర్భం దాల్చిన తరువాత పాదాలు వాపులు వస్తుంటాయి. పాదాలకు సౌకర్యంగా ఉండే చెప్పులు వేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. 
  5. నిద్ర: బయట ఎండలు ఎక్కువగా ఉండే ఈ సమయంలో మధ్యాహ్నం కూడా కనీసం అరగంట నిద్రపోయేలా ప్రణాళిక వేసుకోవాలి.

Updated Date - 2021-04-25T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising