ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

30 ఏళ్లలో మాతృత్వం!

ABN, First Publish Date - 2021-04-07T17:42:12+05:30

ముప్ఫ ఏళ్లు వచ్చాక గానీ పెళ్లి ఊసు ఎత్తడం లేదు ఇప్పటి అమ్మాయిలు. ముప్ఫయిల్లో తల్లవడం చాలా కష్టమనే అభిప్రాయం కొందరిలోఉంటుంది. అయితే సినీతారలు, సెలబ్రిటీలు ముప్ఫయి ఏళ్లు దాటాకే పిల్లలను కనేందు ఆసక్తి చూపడం, వారు ఆ వయసులోనూ పండంటి బిడ్డలకు జన్మనివ్వడం చూస్తున్నాం. ‘మూడు పదుల వయసులోనూ అమ్మతనాన్ని ఆస్వాదించవచ్చు’ అంటున్నారు గైనకాలజిస్ట్‌ అర్చనా ధావన్‌ బజాజ్‌.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముప్ఫ ఏళ్లు వచ్చాక గానీ పెళ్లి ఊసు ఎత్తడం లేదు ఇప్పటి అమ్మాయిలు. ముప్ఫయిల్లో తల్లవడం చాలా కష్టమనే అభిప్రాయం కొందరిలోఉంటుంది. అయితే సినీతారలు, సెలబ్రిటీలు ముప్ఫయి ఏళ్లు దాటాకే పిల్లలను కనేందు ఆసక్తి చూపడం, వారు ఆ వయసులోనూ పండంటి బిడ్డలకు జన్మనివ్వడం చూస్తున్నాం. ‘మూడు పదుల వయసులోనూ అమ్మతనాన్ని ఆస్వాదించవచ్చు’ అంటున్నారు గైనకాలజిస్ట్‌ అర్చనా ధావన్‌ బజాజ్‌.  

గర్భం దాల్చాక ఎలాంటి సమస్యలు ఎదురవకుండా జీవనశైలి మార్పుల గురించి వైద్యులతో చర్చించాలి. ఎందుకంటే 35 ఏళ్లు దాటిన మహిళల్లో హైపర్‌టెన్షన్‌, మధుమేహం వంటివి వచ్చే అవకాశం ఎక్కువ.  

ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యాక తరచూ వైద్యపరీక్షలు చేయించుకోవాలి. ఏ చిన్న అనారోగ్య లక్షణం  కనిపించినా వైద్యులకు చెప్పాలి.  

గర్భం దాల్చిన తరువాత ఎక్కువ మోతాదులో కాల్షియం, ఐరన్‌, విటమిన్‌ డి, ఫోలిక్‌ ఆమ్లం అవసరమవుతాయి. ఆహారంలో ఇవన్నీ లభించేలా చూసుకోవాలి. 

గర్భిణిగా ఉన్నప్పుడు కావాల్సినంత బరువు పెరగడం బిడ్డ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అంతేకాదు కాన్పు అయ్యాక అదనపు బరువు తగ్గడం తేలికవుతుంది.  

గర్భిణులు రోజూ తేలికైన శారీరక వ్యాయామాలు చేయాలి. దాంతో పురిటినొప్పులు భరించేందుకు, కాన్పు సజావుగా సాగేందుకు వీలుగా శక్తి పెరగడంతో పాటు కండరాలు దృఢంగా మారతాయి.

Updated Date - 2021-04-07T17:42:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising