ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ప్రదేశం ఆరోగ్యంగా...

ABN, First Publish Date - 2021-10-05T17:21:22+05:30

జననేంద్రియాలకు సంబంధించి మహిళల్లో అనుమానాలుంటాయి. ఏ లక్షణాలు అనారోగ్యకరమో, వేటిని అనుమానించి వైద్యులను కలవాలో తెలుసుకోవడం అవసరం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(05-10-2021)

జననేంద్రియాలకు సంబంధించి మహిళల్లో అనుమానాలుంటాయి. ఏ లక్షణాలు అనారోగ్యకరమో, వేటిని అనుమానించి వైద్యులను కలవాలో తెలుసుకోవడం అవసరం. 


దురద, మంట: విడవకుండా దురద, మంటలు వేధిస్తుంటే వెజైనల్‌ ఇన్‌ఫెక్షన్‌గా అనుమానించి, వీలైనంత త్వరగా వైద్యులను కలవాలి.


దుర్వాసన స్రావం: దుర్వాసన లోదుస్తులకూ అంటుకుంటుంటే కచ్చితంగా అనుమానించాలి. తరచుగా ఘాటైన, కుళ్లిపోయిన వాసనతో కూడిన స్రావాలు కనిపిస్తే, ఇన్‌ఫెక్షన్‌గా అనుమానించి వైద్యులను కలవాలి.


రక్తస్రావం: నెలసరి మధ్యలో రక్తస్రావం కనిపించినా అప్రమత్తం కావాలి. అలాగే నెలసరి రోజులు క్రమం తప్పి ఎక్కువ రోజుల పాటు కొనసాగినా సమస్య ఉందని అర్థం చేసుకోవాలి.


పొడిబారడం: ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ఉత్పత్తి తగ్గితే వెజైనా పొడిబారి, పలుచగా మారుతుంది. తేలికగా కందిపోతూ ఉంటుంది. ఈ పరిస్థితిని ‘వెజైనల్‌ అట్రోఫీ’ అంటారు. అంగప్రవేశం నొప్పిని కలుగజేస్తుంటే అట్రోఫీగా భావించి, వైద్యులు సూచించిన మందులు వాడుకోవాలి.


Updated Date - 2021-10-05T17:21:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising