ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒత్తిళ్లను అధిగమించండిలా...!

ABN, First Publish Date - 2021-03-08T06:07:22+05:30

వయసుతో సంబంధం లేకుండా ఈమధ్యకాలంలో ప్రతి ఒక్కరూ రకరకాల ఒత్తిళ్లతో అలసిపోతున్నారు. మెదడుకు ప్రశాంతత లేకుండా పోతోంది. అందుకే మెదడును డిటాక్సిఫై చేయాలి. అలా చేస్తే మనసును ఉల్లాసపరిచే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వయసుతో సంబంధం లేకుండా ఈమధ్యకాలంలో ప్రతి ఒక్కరూ రకరకాల ఒత్తిళ్లతో అలసిపోతున్నారు. మెదడుకు ప్రశాంతత లేకుండా పోతోంది. అందుకే మెదడును డిటాక్సిఫై చేయాలి. అలా చేస్తే మనసును ఉల్లాసపరిచే ఎన్నో విషయాలు  మన చుట్టూ ఉండడాన్ని చూడగలం. దీంతో ప్రతిక్షణం ఉల్లాసంగా గడపగలుగుతాం.


  1. ధ్యానం చేసుకుంటే మానసిక ప్రశాంతత వస్తుంది. 
  2. ఇంటి పనులంటే చాలామంది విసుక్కుంటారు. కానీ మనసు పెట్టి వాటిని చేస్తే ఆ పనులు విసుగు అనిపించవు. పైగా మనసుకు అవి ఎంతో రిలాక్సేషన్‌ ఇస్తాయి. 
  3. మనలోని బలాలు, బలహీనతలు తెలుసుకున్నప్పుడే వాస్తవాన్ని గుర్తించగలం. మెదడుతో చెలిమి చేస్తే మీరేంటో మీకే స్పష్టంగా తెలుస్తుంది. ఆ భావనే మీ మెదడును డిటాక్సిఫై చేస్తుంది. మనలో రేగే ప్రతి ఆలోచనను శత్రువుగా కాకుండా ఒక మిత్రువుడిగా భావించి చూడడం అలవాటవుతుంది. 
  4. మనలోని ఇగోతో స్నేహం చేయగలిగితే ఎలాంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించుకోవచ్చు. అంతేకాదు మీరేంటి అన్నది మీకు మీరే తెలుసుకోగలగడంలో ఎంతో ఫన్‌ కూడా ఉంటుంది. దీంతో మనసును ఉల్లాసపరిచే వైవిధ్యమైన పనులు చేస్తూ మిమ్మల్ని వేధిస్తున్న ఒత్తిడికి దూరమవుతారు. 
  5. నిత్యం వ్యాయామం చేయాలి. రోజూ కాసేపు నడిస్తే అది ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. వాకింగ్‌ చేసే సమయంలో అందమైన ప్రకృతిని ఆస్వాదించాలి. అది మానసికంగా ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. 
  6. మీ చుట్టూ ఉన్నవారితో స్నేహంగా ఉండటం వల్ల వచ్చే మానసిక ఆనందం వెలకట్టలేనది.
  7. సేవా భావం, ఇతరులకు సహాయపడడం వల్ల ఆలోచనాధోరణిలోనే మార్పువస్తుంది. ప్రతి విషయాన్ని చూసే దృష్టి, ఆలోచించే తీరు మారుతుంది.
  8. ఎలాంటి భావోద్వేగాల నైనా అణచివేయడానికి  ప్రయత్నించవద్దు. వాటిని బయటకు వ్యక్తం చేస్తే మనసులోని బరువు తగ్గడమే కాకుండా, మెదడు తేలికవుతుంది.

Updated Date - 2021-03-08T06:07:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising